iDreamPost

ఒక్కనెలలోనే 16లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. కారణమిదే !

ఒక్కనెలలోనే 16లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. కారణమిదే !

మన దేశంలో ఒక్క నెలలోనే 16 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. కొంతకాలంగా ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్న ఖాతాదారులపై వాట్సాప్ సంస్థ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ఏప్రిల్ నెలలో భారత్ లో 16.6లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ లో గ్రీవెన్స్ సెల్ కు 844 ఫిర్యాదులు రాగా.. వాటిలో 123 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే మార్చి నెలలో 597 ఫిర్యాదులు రాగా.. 74అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ సంస్థ పేర్కొంది.

కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. 50 లక్షలకు పైగా యూజర్లను కలిగి ఉన్న డిజిటల్ ప్లాట్ ఫాం లు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో నిబంధనలను ఉల్లంఘించిన 16,66,000ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వివరించింది.

తాజాగా వాట్సాప్ విడుదల చేసిన నివేదికలో ఇలా పేర్కొంది. “వినియోగదారుల భద్రతా నివేదికలో యూజర్ల ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను పొందుపరుస్తాం. వాటితోపాటే ఐటీ రూల్స్ ను ఉల్లంఘించేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలో గ్రీవెన్స్ సెల్ కు ఏప్రిల్ నెలలో 844 ఫిర్యాదులు రాగా.. 123 అకౌంట్లపై చర్యలు తీసుకున్నాం. అలాగే వాట్సాప్ ను దుర్వినియోగానికి వాడకుండా.. స్వతంత్ర నివారణ చర్యల ద్వారా లక్షల అకౌంట్లపై నిషేధం విధించాం.” అని వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి