iDreamPost

Tomato Flu కేర‌ళ‌ను వ‌ణికిస్తున్న టమోటో ఫ్లూ, ఏంటి వ్యాధి ల‌క్షణాలు? ఎంత ప్ర‌మాద‌క‌రం?

Tomato Flu కేర‌ళ‌ను వ‌ణికిస్తున్న టమోటో ఫ్లూ, ఏంటి వ్యాధి ల‌క్షణాలు? ఎంత ప్ర‌మాద‌క‌రం?

కేరళ కొత్త వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ ఇన్‌ఫెక్షన్‌, సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. క‌రోనా అనుభ‌వాల దృష్ట్యా, ఈ ఇన్‌ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకొంటారు.

టమాటో ఫ్లూ అంటే?

ఇది అరుదైన వ్యాది. ఇంతకు ముందు ఎక్క‌డెక్క‌డ సోకిందో? దాని ప్రాభ‌వం ఏంటో తెలుసుకోవ‌డానికి వైద్య‌నిపుణులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

టమాటో ఫ్లూ ల‌క్షణాలేంటి?
ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్. నోరు త‌డారిపోతుంది. చికాకుగా అనిపిస్తుంటుంది. బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే, టమాటో ఫ్లూ అనే పేరు వచ్చింది. ఇది ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ప్రభావం చూపిస్తుంది.

టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ప్రాథమిక లక్షణం. చికున్‌గున్యాలాగే హై ఫీవ‌ర్ , ఒళ్లు నొప్పులు, అలసట కనిపిస్తాయి. కీళ్ల నెప్పుల‌తో న‌డ‌వ‌లేరు.

కేరళలోని కోల్లాంతో పాటు , అర్యన్‌కావు, అంచల్‌, నెడువతుర్‌ ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువ క‌నిపిస్తున్నాయి.

ఈ అంతుచిక్క‌ని వ్యాధితో సరిహద్దు తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకొనే అవకాశం క‌నిపిస్తోంది.

ఇన్‌ఫెక్షన్‌ సోకిన పిల్లలను, ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్‌ కాకుండా జాగ్రత్తపడాలని, వైద్య పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల‌న్న‌ది వైద్య‌నిపుణ‌ల మాట‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి