iDreamPost

పాన్ ఇండియా సినిమాల భవిష్యత్తు ఎంటి?

  • Published Feb 06, 2024 | 8:37 PMUpdated Feb 06, 2024 | 8:37 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవల్ లో సినిమాలను తెరకెక్కించడం అనేది ట్రెండ్ గా మారింది. మరి, ఈ తరహా సినిమాలను రూపొందించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం అనేది చిన్న మాట కాదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రెండు సినిమాల పై మాత్రం కలెక్షన్స్ పరంగా ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. అవి ఏమిటంటే..

గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత తెలుగు సినిమా తన పరిధి దాటి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం సర్వ సాధారణంగా మారింది. అందులో కొన్ని పెద్ద హిట్లయ్యాయి మరి కొన్ని అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినా మన. తెలుగు సినిమా తన ప్రయత్నాలు మానలేదు. ఇప్పుడు అలాంటి ప్రయత్నంలో రెండు ముఖ్యమైన సినిమాలు రాబోతున్నాయి. ప్రభాస్ కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప 2.

నిజానికి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కొట్టాలి అంటే అంత సులువైన పని ఏమీ కాదు. ఒక సినిమాను ప్రకటించిన రోజు నుండి ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఉండేలా చేయటం చాలా కీలకం. ఆపై టీజర్, ట్రెయిలర్లు ఆకట్టుకోగలిగితే అప్పుడు నిజంగా ఆ సినిమాకి హైప్ వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 500 -1000 కోట్ల గ్రాస్ సాధించడం ప్రతి సినిమాకీ సాధ్యమయ్యే పని కాదు అయితే, ఇండియా నుంచి మాత్రమే 500 కోట్ల నెట్ వసూలు చేయడం అనేది మరింత భిన్నమైన విషయం. పైన పేర్కొన్న అంశాలే కాకుండా, సినిమాకు అసాధారణమైన మౌత్ టాక్, కనీసం రెండు వారాల పాటు ఇతర సినిమాతో క్లాష్ లేని రన్ వంటివి కూడా అవసరం అవుతాయి.

ప్రస్తుతానికి, ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ ఫిగర్‌ను అధిగమించే అవకాశం ఉన్న తెలుగు సినిమాలు కల్కి 2898 AD మరియు పుష్ప 2. పుష్ప ది రూల్ సినిమాకి సరైన టాక్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల మార్కు దాటడం పెద్ద కష్టం కాదు.

షారుఖ్ ఖాన్ పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో భారతదేశంలో 500 కోట్ల నెట్ మార్క్‌ను సాధించారు. ఈ సినిమాల వల్ల 500-కోట్ల నెట్ బ్లాక్‌బస్టర్‌ను సులభంగా సాధించగలదనే అభిప్రాయాన్ని సృష్టించింది. పఠాన్ మరియు జవాన్ తర్వాత, యానిమల్ మరియు గదర్ 2 ఇండియాలో 500 కోట్లకి పైగా సాధిస్తే యానిమల్ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ ఫిగర్‌ను దాటింది.

ఇప్పుడు పైన పేర్కొన్న విధంగా ప్రభాస్ కల్కి మరియు అల్లు అర్జున్ పుష్ప 2 తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బాక్సాఫీస్ వద్ద భారీగా సత్తా చాటే అంచనాలున్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అంచనాలను మించి భారీ విజయం సాధించాలని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి