iDreamPost

Bheemla Nayak : ట్రయాంగిల్ వార్ లో ఏం జరగబోతోంది

Bheemla Nayak  : ట్రయాంగిల్ వార్ లో ఏం జరగబోతోంది

వచ్చే జనవరి సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ముందు చెప్పినట్టు 12నే రిలీజ్ అవుతుందా లేదానేది అంతు చిక్కడం లేదు. మొన్నటిదాకా పోస్టర్లలో డేట్ ని సగర్వంగా వేసిన యూనిట్ ఇప్పుడు దాన్ని తీసేసి ప్రమోషన్లు చేస్తోంది. రేపు టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ కాబోతోంది. అందులోనైనా క్లారిటీ ఇస్తారేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రాధే శ్యామ్ లు బరిలో ఉన్నా సరే ఏం పర్లేదు రావాల్సిందేనన్న ధీమా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నిర్మాతను ట్రోలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. డిస్ట్రిబ్యూటర్లు సైతం కక్కలేక మింగలేక ఎదురు చూస్తున్నారు. వీళ్ళలో కొందరు మూడు సినిమాలకు అడ్వాన్ ఇచ్చినవాళ్లు ఉన్నారు. ఒకవేళ మూడు క్లాష్ అయితే కలెక్షన్ల పరంగా ఎంతో కొంత కాదు గట్టిగానే ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. ఉదాహరణకు దిల్ రాజు నైజాంలో వీటి హక్కులను తీసుకున్నారు. స్క్రీన్లను పంచడం ఆయనకో పెద్ద తలనెప్పి వ్యవహారంగా మారిపోతుంది. పవన్ మాత్రం పండగ బరిలో దిగాలన్నట్టుగానే హింట్లు ఇస్తున్నారు కానీ అబ్బాయి రామ్ చరణ్ సినిమా ఉండగా ఒక అడుగు వెనక్కు తీసుకునే ఛాన్స్ లేకపోలేదు.

మొత్తానికి ట్రయాంగిల్ వార్ తప్పదా అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఈ వారంలో దొరికే ఛాన్స్ ఉంది. ఈ గోలంతా ఎందుకని మహేష్ బాబు సర్కారు వారి పాట నీట్ గా ఏప్రిల్ 1 కి వెళ్ళిపోయి టెన్షన్ ని దూరం చేసుకుంది. ఎటొచ్చి భీమ్లా నాయక్ కి ఇది ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. ఎంత పవన్ సినిమా అయినా సరే అపోజిషన్ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులోనూ అవి పాన్ ఇండియా సినిమాలు. భీమ్లా నాయక్ అలా కాదు. సో ఈ సమీకరణాలన్నీ ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి. సంక్రాంతికి సరిగ్గా ఇంకో 65 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ అయోమయానికి చెక్ పెడితే బెటర్

Also Read : Bholaa Shankar : ఇద్దరి సినిమాల్లో ఒకటే సెంటిమెంట్ – వాట్ టు డూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి