iDreamPost

ఎఫ్ఐఆర్ కాపీలో నరేంద్ర మోడీ పేరు

ఎఫ్ఐఆర్  కాపీలో నరేంద్ర మోడీ పేరు

బెంగాల్ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే మాటల తూటాలతో కత్తులు దూసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మరో రసవత్తర సన్నివేశం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని దీదీ ఓ దీదీ అంటూ సంబోధిస్తూ ఉన్న నరేంద్ర మోడీ పేరును పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లో రాశారు. అసలు ఎఫ్ఐఆర్ లో రాయడానికి చేయడానికి గల కారణాలు ఏంటి ఒకసారి పరిశీలిద్దాం.

8 దశల్లో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నాయి. ఈ క్రమంలో మూడో దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “దీదీ ఓ దీదీ” అనే స్వరం అందుకున్నారు. మాటకు ముందు… మాటకు తర్వాత… ఇదే పలుకుతూ… తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. దాంతో దీదీ ఓ దీదీ అనే ట్యాగ్ లైన్ దూసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి బీజేపీ నేతలంతా ఇదే వాయిస్ అందుకున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా… దీదీ ఓ దీదీ అంటూ… మమతపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఓ వివాదంలో ఎఫ్ఐఆర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు రాశారు.

మోడీ పేరు ఎందుకు నమోదయింది అంటే..

ఉత్తర కోల్‌కతాలో అంహెరెస్ట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో అక్కడి పోలీసులు ఇద్దరిని తీసుకొచ్చి అరెస్టు చేశారు. వారిపై కేసు రాశారు. వారిద్దరూ అమ్మాయిల వెంట పడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాయిస్‌తో దీదీ ఓ దీదీ అంటూ ఈవ్ టీజింగ్ చేస్తున్నారు. వెంటనే వారు పోలీసులకు కాల్ చేశారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ మొత్తం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ఎఫ్ఐఆర్లో రాశారు గానీ… దీనికీ మోదీకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఇలా నరేంద్ర మోదీ చేసిన ప్రచారంలోని దీదీ ఓ దీదీ అనే పదాన్ని ఉపయోగిస్తూ… అమ్మాయిలను టీచ్ చేస్తున్నారు అని ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు. ఆ క్రమంలో మోదీ పేరు రాయాల్సి వచ్చింది. ఐతే… తాను వేసిన సెటైరికల్ డైలాగ్ దీదీ ఓ దీదీ ఇంతలా పేలుతుందనీ… చివరకు అది వివాదాస్పదం కూడా అవుతుందని ఆ క్షణం మోదీ ఆలోచించివుండరు.

దీదీ అంటే అక్క అని అర్థం. మమతా బెనర్జీని ఆమె మద్దతు దారులు దీదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మమతా బెనర్జీ కూడా వారితో అలా కలిసిపోయారు. ఆ క్రమంలో దేశం మొత్తం ఆమెను దీదీ అని పిలుస్తోంది. ప్రధాని మోదీ కూడా దీదీ అని పిలుస్తూనే ఆయనది ప్రత్యర్థి పార్టీ కాబట్టి… ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు కామన్‌గా చేస్తున్నారు. అంతే తప్ప… ఆమెను కించపరిచే ఉద్దేశంతో కాదు. కానీ… ఇలాంటి పోకిరీలు మాత్రం… దీన్ని సాకుగా చూపిస్తూ… అమ్మాయిలను ఏడిపిస్తే… తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 4 దశలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.

Also Read : బెంగాల్ బరిలో ఆడియో యుద్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి