iDreamPost

OTT లవర్స్‌కు పండగే.. ఒక్క రోజే 9 సినిమాలు.. ఆ 2 చాలా స్పెషల్‌

  • Published Feb 02, 2024 | 10:02 AMUpdated Feb 02, 2024 | 10:02 AM

Weekend OTT Release: వీకెంట్‌ వచ్చేసింది అంటే ఓటీటీ లవర్స్‌.. ఆ రోజుల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌లో ఓటీటీలో సందడి చేయనున్న సినిమాల లిస్ట్‌ ఇదే...

Weekend OTT Release: వీకెంట్‌ వచ్చేసింది అంటే ఓటీటీ లవర్స్‌.. ఆ రోజుల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌లో ఓటీటీలో సందడి చేయనున్న సినిమాల లిస్ట్‌ ఇదే...

  • Published Feb 02, 2024 | 10:02 AMUpdated Feb 02, 2024 | 10:02 AM
OTT లవర్స్‌కు పండగే.. ఒక్క రోజే 9 సినిమాలు.. ఆ 2 చాలా స్పెషల్‌

గతంలో శుక్రవారం వచ్చింది అంటే చాలు.. థియేటర్లో ఏ కొత్త సినిమా విడుదలవుతుందా అని ఎదురు చూసేవారు. చాలా వరకు ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా కచ్చితంగా విడుదలయ్యేది. అయితే కరోనా తర్వాత సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అలానే సినిమా పరిశ్రమలో వచ్చిన మార్పుల్లో ముఖ్యమైనది ఓటీటీ. కోవిడ్‌ సమయంలో అందరికి తీరిక దొరకడంతో.. ఓటీటీల్లో మూవీలు చూసి ఎంజాయ్‌ చేయడం ప్రారంభించారు. ప్రేక్షకులు ఓటీటీలకు ఎంతలా అలవాటు పడ్డారంటే.. ఇప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే దాన్నో పనిలా భావిస్తున్నారు. నెల రోజులు ఆగితే చక్కగా ఇంట్లోనే కూర్చుని.. ఓటీటీలో చూడొచ్చు అనుకుంటున్నారు.

దాంతో ఓటీటీల హవా పెరగడమే కాక.. ప్రతి వీకెండ్‌ కొత్త సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలానే ఈ వీకెండ్‌లో ఒక్క రోజే ఏకంగా 9 సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయనున్నాయి. వాటిల్లో రెండు చిత్రాల మీద ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంది. అవి ఏవంటే.. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్‌, మరోకటి సైకలాజికల్ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఎల్‌ఎస్‌డీ పై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ వీకెండ్‌లో.. ఏ ఓటీటీల్లో ఏ సినిమాలు రిలిజ్‌ అవుతున్నాయో చూడండి.

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

నెట్‌ఫ్లిక్స్

  1. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 01
  2. లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
  3. ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 02

అమెజాన్ ప్రైమ్

  1. డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
  2. మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
  3. సైంధవ్ (తెలుగు మూవీ) – ఫిబ్రవరి 02

హాట్‌స్టార్

  1. మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
  2. సెల్ఫ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్

  1. ఓ మై డార్లింగ్ (మలయాళ చిత్రం) – ఫిబ్రవరి 02

ఎమ్‌ఎక్స్ ప్లేయర్

  1. ఎల్‌ఎస్‌డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2

ఇదిలా ఉండగా ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలే సందడే ఉంది. వీటిల్లో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్‌ సోహైల్ సినిమా ‘బూట్ కట్ బాలరాజు’ పై ఆసక్తి నెలకొని ఉంది. వీటితో పాటు అభినవ్ గోమటం నటించిన కిస్మత్, యశ్‌ పూరి చిత్రం హ్యాపీ ఎండిగ్‌, మరో చిత్రం గేమ్‌ ఆన్‌ కూడా రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల హడావుడే ఉంది.

ఇది కూడా చదవండి:

  1. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ OTT పార్టనర్ ఫిక్స్!
  2. OTTలోకి ‘సలార్’ ను ఢీ కొట్టి విజయం సాధించిన మూవీ! స్ట్రీమింగ్ వివరాలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి