iDreamPost

పెళ్లి విందులో పొట్టు పొట్టు కొట్టుకున్నారు! వీడియో వైరల్

పెళ్లి విందులో పొట్టు పొట్టు కొట్టుకున్నారు! వీడియో వైరల్

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురైతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. కొంతమంది హత్యలకు పాల్పపడుతున్నారు. సాధారణంగా వివాహ వేడుకల్లో చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకునే స్థాయి వరకు వెళ్తుంటాయి. వధూవరులకు సంబంధించిన బంధువుల మధ్య తలెత్తె గొడవల వల్ల కొన్నిసార్లు వివాహలు క్యాన్సల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పాకిస్థాన్ లో ఓ వివాహ వేడుకలో విందు జరుగుతున్న సమయంలో అతిథుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కుర్చీలు మడతపెట్టి కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివాహానికి హాజరైన అతిథులు ప్రశాంతంగా ఆరగించడం మొదలు పెట్టారు. సర్వీస్ చేసేవాళ్లు టేబుల్స్ వద్దకు వెళ్లి సర్వీస్ చేస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న విందు కార్యక్రమంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.  ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరోవ్యక్తి టోపీని లాగి ముందుకు విసిరాడు. దాంతో వారి మద్య వాగ్వాదం మొదలై.. క్షణాల్లోనే పెద్ద గొడవకు దారి తీసింది. అంతే ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం మొదలు పెట్టారు.

అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన విందు కార్యక్రమంలో బంధువులు రెండు వర్గాలుగా వీడి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అలా అతిథుల మధ్య చాలా సేపటి వరకు గొడవ సాగింది. ఆ గొడవ హింసాత్మకంగా మరుతున్న సమయంలో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గొడవ సర్థుమణిగింది. ఈ ఘటన ఆగస్టు 24వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోని ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏకంగా ఈ వీడియోకి 3,33000 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి