iDreamPost

ఒలంపిక్స్ జరిగేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం : కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతోంది.

ఒలంపిక్స్ జరిగేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం : కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠత నెలకొంది. ఈ సారి అధికారాన్ని చేపట్టేది ఎవ్వరో మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఈ నెల 30వ తేదీన శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్దులు. ఈ సారి తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార బీఆర్ఎస్. తాము చేసిన అభివృద్ది, ప్రజలకు అందించిన ప్రజా సంక్షేమ పథకాలను పరమాధిగా ఈ సారి గెలుపు తధ్యమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారాల్లో విసృత్తంగా పాల్గొంటున్నారు ఐటి శాఖ మంత్రి కేటీఆర్. ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు.

ఇంటర్వ్యూలు, సమ్మిట్స్, సామాన్యులతో మమేకమవుతూ.. ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు కేటీఆర్. తాజాగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్‌లో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా కీలక విషయాలు ప్రస్తావించారు. ‘2014లోనే తెలంగాణలో మార్పు వచ్చింది. కోవిడ్, ఎన్నికలు మినహా మిగతా ఆరున్నరేళ్ల పాలన తెలంగాణ ప్రజలు ముందుంది. గత ముఖ్యమంత్రుల పని తీరు.. కేసీఆర్ పాలనలో పని తీరు గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి. ‘ప్రో రూరల్ ప్రో అర్బన్, ప్రో అగ్రికల్చర్, ప్రో బిజినెస్‘ అనే పంథాపై కేసీఆర్ పని చేశారు. ఇక్కడ ఐటి రంగం అభివృద్ధి చెందింది. ఎగుమతులు కూడా పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తులు పుంజుకున్నాయి. రాష్ర సంపద రెట్టింపు అయ్యింది. 2014లో వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది’ అని తెలిపారు.

’టీఎస్ఐపాస్ ద్వారా 27 వేల పరిశ్రమలు వచ్చాయి. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాభివృద్దిని కేంద్రం గుర్తించింది. గతంలో క్రెడాయ్‌కు సంబంధించి కేసీఆర్ ఒకే రోజు ఏకంగా దాదాపు 6 జీవోలు విడుదల చేశారు’ అని చెప్పారు. ఈ సమయంలో తిరిగి అధికారంలోకి వస్తే.. ఈ హామీలు చేస్తామని అన్నారు. సెంట్ పర్సంట్ అక్షరాస్యత, అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నామని అన్నారు. 2047 నాటికి స్వాత్రంత్యం వచ్చి 100 ఏళ్లు అవుతుందని, అప్పటిలోగా రాష్రం పూర్తి సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. 24 గంటల నీటి వసతి, హైదరాబాద్‌లో మరింత కట్టుదిట్ట భద్రత నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరా ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే 2030లోగా హైదరాబాద్‌ను ఒలంపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతామన్నారు. 2040 వరకు గ్రీన్ ట్రాన్ పోర్టుగా మార్చాలని, వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ ప్లాంట్లు పెంచుతామని అన్నారు. 415 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరిస్తామని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి