iDreamPost

బ్రేకింగ్‌: వరంగల్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

  • Published Aug 25, 2023 | 9:57 AMUpdated Aug 25, 2023 | 9:57 AM
  • Published Aug 25, 2023 | 9:57 AMUpdated Aug 25, 2023 | 9:57 AM
బ్రేకింగ్‌: వరంగల్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

తెలంగాణలో భూకంపం కలకలం రేపింది. నేడు అనగా.. శుక్రవారం ఉదయం వరంగల్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4.43 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూకంపం కారణంగా దాదాపు 30 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో.. 30 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ గుర్తించింది. సరిగ్గా చెప్పాలంటే. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఇది సంభవించినట్లు ఎన్‌సీఎస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

జనాలందరూ మంచి నిద్రలో ఉన్న తెల్లవారుజాము సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో.. వరంగల్ వాసులు వణికిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక.. భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. స్వల్ప భూకంపం కావడంతో జనాలు కూడా వెంటనే ఆ షాక్‌ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున వరంగల్‌లో సంభవించిన భూకంపం వల్ల నష్టం వాటిల్లినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి