iDreamPost

అంతులేని విషాదం.. ప్రమాదంలో తండ్రి కూతురు మృతి, అల్లుడి పరిస్థితి విషమం

మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్​లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు.

మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్​లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు.

అంతులేని విషాదం.. ప్రమాదంలో తండ్రి కూతురు మృతి, అల్లుడి పరిస్థితి విషమం

పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కూతురు, అల్లుడిని బైక్ పై ఇంటికి తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురవ్వగా ఆ ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అల్లుడు తీవ్రగాయాలతో విషమ స్థితిలో ఉన్నాడు. దీంతో వారి కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. ఈ అంతులేని విషాదం తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. పండగ పూట అందరితో ఆనందంగా గడపాల్సిన వారు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్​లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లేందుకు హైదరాబాద్​ నుంచి బయలుదేరారు అనూష, రాజు. వీరిద్దరు తొర్రూరుకు చేరుకునే సరికి రాత్రి 11 అయ్యింది. ఆ సమయంలో మొరిపిరాలకు వెళ్లేందుకు వాహనాలు ఏమీ లేకపోవడంతో తమను తీసుకెళ్లేందుకు అనూష తన తండ్రిని తొర్రూరుకు రావాల్సిందిగా కోరింది. అనూష తండ్రి వెంకన్న వెంటనే బైక్ పై తొర్రూరుకు చేరుకున్నాడు.ఈ క్రమంలో వెంకన్న తన బైక్​ పై కూతురు, అల్లుడిని ఎక్కించుకుని మొరిపిరాలకు బయలుదేరారు.

అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో కిష్టాపురం క్రాస్​ రోడ్డు సమీపంలోని పెట్రోల్​ పంపు వద్దకు చేరుకోగా.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు వారి బైక్​ పైకి దూసుకెళ్లింది. అతి వేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొనడంతో కారు కింద పడిన వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూష, ఆమె భర్త రాజుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే తొర్రూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష మృతి చెందగా.. రాజు పరిస్థితి విషమంగా ఉంది. కొండంత పండగ వేళ తండ్రి, కూతురు మరణించడం, అల్లుడు ఆసుపత్రి పాలవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి