iDreamPost

Twitter : సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం

Twitter : సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం

సోషల్ మీడియా ఉద్దేశం ఏదైనా సరే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు దాన్ని యథేచ్ఛగా వాడుకోవడం చూస్తున్నాం. స్టార్ హీరోల అభిమానులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, విపరీతమైన అర్థాలతో మాటల దాడులు చేసుకోవడం నిత్యం చూస్తున్నాం. మేము మేము ఒకటే అని పబ్లిక్ స్టేజి మీద హీరోలు ఎంతగా చెప్పుకున్నా సరే ఈ ధోరణిలో మార్పు రావడం లేదు. పై పెచ్చు కొన్నిసార్లు వికృత రూపం దాల్చి మారీ దారుణంగా తిట్టేసుకుంటున్నారు. ఎవరి కోసమైతే వకాల్తా పుచ్చుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ రొంపిలో దిగిన వాళ్ళు మాత్రం లేనిపోని వివాదాలు కొనితెచ్చుకోవడం గత కొన్నేళ్లుగా ఒక తంతుగా మారిపోయిన ట్రెండ్.

దీనికి సెలబ్రిటీలు సైతం మినహాయింపు కావడం లేదు. రెండు రోజుల క్రితం ఒక స్టార్ డైరెక్టర్ మరో పెద్ద రైటర్ అవసరం లేని ఇష్యూ మీద ట్విట్టర్ లో వ్యంగ్యాల దాడి చేసుకున్నారు. కోట్లాది వాడకందారులు చదువుతున్నారన్న స్పృహ లేకుండా కౌంటర్లు సెటైర్లు వేసుకున్నారు. సామాన్యులు ఇలా చేస్తే ఎవరికీ చేరవు. కానీ ఇండస్ట్రీలో పేరు పలుకుబడి ఉన్న వాళ్ళు నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేలా వాదించుకుంటూ మేధావి ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తేనే ఈ చిక్కులన్నీ. సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయం మీద వాదులాటలు జరగడం విచిత్రం. వీళ్ళ ట్విట్టర్ వార్ ఎంజయ్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉండటం వాస్తవం.

మనం ప్రత్యక్షంగా ఉండం కాబట్టి సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది టెక్నాలజీ ప్రపంచం. ఇప్పుడు మనం ఒకరిని తప్పంటే గతంలో మనం చేసిన తప్పుని ఆధారాలతో సహా బయటికి తీసి నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండక తప్పదు. ప్రముఖులైనా ఎలాంటి పాపులారిటీ లేని మాములు మనుషులైనా ఒకటే సూత్రం వహిస్తుంది. కాకపోతే సెలబ్రిటీలు ఏమరుపాటుగా ఉంటేనే కష్టం. ఇప్పుడు మనం చేసే మాటల యుద్ధాలే భవిష్యత్తులో స్క్రీన్ షాట్ల రూపంలో బయటికి వచ్చి ఇబ్బందులు సృష్టిస్తాయి. మనవైపు నాలుగు వేళ్ళు ఉండేలా చేస్తాయి

Also Read : Pawan Kalyan & SDT : పవర్ ఫుల్ కాంబినేషన్ బాగుంది కానీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి