iDreamPost

OTTలోకి వచ్చేసిన బిగ్‌ బాస్‌ వీజే సన్ని సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

  • Published Mar 05, 2024 | 11:26 AMUpdated Mar 14, 2024 | 4:13 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఇటీవలే నటించిన సినిమా దాదాపు 3 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇంతకి ఎక్కడంటే..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఇటీవలే నటించిన సినిమా దాదాపు 3 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Mar 05, 2024 | 11:26 AMUpdated Mar 14, 2024 | 4:13 PM
OTTలోకి వచ్చేసిన బిగ్‌ బాస్‌ వీజే సన్ని సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన ‘వీజే సన్నీ’ అందరికి సుపరిచితమే. కేవలం ఒక బుల్లితెర నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన వీజే సన్నీ.. ఆ తర్వాత ఆ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక అదృష్టంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. అదే జోష్ తో సన్ని హీరోగా సినిమాల్లో నటించేందుకు ఆవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే సన్నీ ‘సౌండ్ పార్టీ’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాను దర్శకుడు సంజయ్ షేరి తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్ గా హృతికా శ్రీనివాస్ నటించింది. కాగా, ఈ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆశించిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను అలరించకపోవడంతో పెద్దగా థియేటర్లలో ఆడలేదు. అయితే ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇంతకి ఎప్పుడంటే..

కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన వీజే సన్నీ సౌండ్ పార్టీ సినిమా దాదాపు 100 రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. అయితే, ఈ సినిమా ముందుగా ఓటీటీ డీల్ కుదుర్చుకోలేకపోయింది. కనుక ఆలస్యంగా ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే, సౌండ్ పార్టీ సినిమాను ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు దక్కించుకుంద. దీంతో ఈ సినిమాను ఈనెల అనగా (మార్చి 8వ) తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయానద్ని స్వయంగా ఆహానే నిన్న మార్చి4 న అధికారికంగా ప్రకటించి ఓ పోస్టర్ ట్వీట్ చేసింది. అందులో.. ‘సౌండ్ డీటీఎస్‍లో మోగిద్దామా.. ఆహాలో సౌండ్ పార్టీ. మార్చి 8న ప్రీమియర్ కానుంది’ అంటూ ఆహా ట్వీట్ చేసింది. దీనితో పాటు బ్రైట్ కామెడీ మూవీ అంటూ ఓ పోస్టర్ ను కూడా ట్వీట్ చేసింది. ఇక ఈ పోస్టర్ లో సన్నితో పాటు హీరోయిన్ హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ ఉన్నారు.

ఇక సౌండ్ పార్టీ సినిమాలో వీజే సన్నీ,హృతిక శ్రీనివాస్ లతో పాటు.. శివన్నారాయణ, పృథ్విరాజ్, అలీ, సప్తగిరి కీలకపాత్రలు పోషించారు.కాగా, ఈ సినిమాను ఫుల్ మూన్ మీడియా పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి మదీన్ సంగీతం అందించగా.. శ్రీనివాస్ జే రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

అలాగే సౌండ్ పార్టీ సినిమా విషయానికోస్తే.. భారీగా డబ్బు సంపాదించాలని నానా తంటాలు పడి.. డాలర్ కుమార్ (వీజే సన్నీ), అతడి తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ) ఎలాగైనా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో భారీగా అప్పులు చేసి ఓ హోటల్ పెడతారు. సిరి (హృతిక)ని హీరో కుమార్ ప్రేమిస్తాడు. అయితే, కుమార్ హోటల్ బిజినెస్‍ను సిరి తండ్రి పాడుచేస్తాడు. దీంతో తండ్రీకొడుకులు కుబేర్, డాలర్ మళ్లీ కష్టాల్లో చిక్కుకుంటారు. అయితే, తీర్చాల్సిన అప్పులు భారీగా ఉంటాయి. దీంతో తన కుమారుడు చేసిన నేరాన్ని తమ మీద వేసుకొని జైలుకు వెళితే భారీగా డబ్బు ఇస్తానని తండ్రీకొడుకులకు ఎమ్మెల్యే వరప్రసాద్ (పృథ్విరాజ్) ఆశ చూపుతాడు. దీంతో వారిద్దరూ జైలుకు వెళతారు. ఏకంగా ఉరిశిక్ష పడుతుంది. అయితే, ఈ శిక్ష నుంచి డాలర్ కుమార్, కుబేర్ బయటపడ్డారా? అసలు ఎమ్మెల్యే కొడుకు చేసిన నేరమేంటి? చివరికి ఏం జరిగిందనేది తెలియాలంటే ఆలస్యం చేయకుండా సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతున్న సన్నీ సౌండ్ పార్టీ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి