iDreamPost

Rathnam OTT: విశాల్ రత్నం మూవీ రాబోయేది ఆ OTT లోకే ! కానీ థియేటర్స్ లో మిస్ కాకండి..

  • Published Apr 29, 2024 | 6:11 PMUpdated Apr 29, 2024 | 6:11 PM

హీరో విశాల్ తమిళ నాట ఎంత గుర్తింపు ఉందో తెలుగులో కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజాగా ఈ హీరో నటించిన సినిమా "రత్నం". ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హీరో విశాల్ తమిళ నాట ఎంత గుర్తింపు ఉందో తెలుగులో కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజాగా ఈ హీరో నటించిన సినిమా "రత్నం". ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 29, 2024 | 6:11 PMUpdated Apr 29, 2024 | 6:11 PM
Rathnam OTT: విశాల్ రత్నం మూవీ రాబోయేది ఆ OTT లోకే ! కానీ థియేటర్స్ లో మిస్ కాకండి..

సినిమా ప్రియులకు తమిళం, మళయాలం, తెలుగు అనే భాష బేధాలు లేకుండా.. కథలను బట్టి ఆయా సినిమాలలో నటి నటుల పని తీరుని బట్టి.. వారి ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఇతర భాషల హీరోలు, హీరోయిన్లు తెలుగు నాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే హీరో విశాల్ కూడా. అయితే విశాల్ కు తమిళ నాట ఎంత గుర్తింపు ఉందో.. ఈ హీరో సినిమాలకు తెలుగులో కూడా అంతే గుర్తింపు ఉంది. ఇక విశాల్ కూడా అటు సినిమాలలోను ఇటు సోషల్ మీడియాలోను అడపాదడపా ఎదో ఒక ప్రస్తావనలతో వైరల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటించిన సినిమా “రత్నం”. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యి వారం రోజులు కూడా కాకముందే.. అప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తుంది.

విశాల్ తాజాగా నటించిన సినిమా “రత్నం”. ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కారతికేయన్ సంతానం ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా ఈ సినిమాలో విశాల్ తో పాటు, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఏ నడుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ కూడా వెంటనే ఓటీటీ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో రత్నం సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. కానీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసే వీలుంది.

ఇక రత్నం సినిమా కథేంటంటే.. ఈ స్టోరీ మొత్తం కూడా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ కొనసాగుతుంది. అయితే హీరో చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అతను ఓ కూరగాయల మార్కెట్ లో పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉండే సముద్రఖని ను ఓసారి అతని ప్రాణాలకు తెగించి మరి కాపాడతాడు. అతని కోసం ఒకర్ని చంపి జైలుకు కూడా వెళ్తాడు. దీనితో సముద్రఖని అతనిని సొంత కొడుకులా పెంచుకుంటాడు. ఈ క్రమంలో హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతలోనే ఆమెను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తారు. ఆమెను కూడా హీరో రక్షిస్తాడు . అసలు ఆమెను చంపాలనుకున్నది ఎవరు ! దాని వెనుక ఉన్న కథేంటి ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.. ఓటీటీ లోకి రాడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. థియేటర్స్ లో ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి