iDreamPost

Virat Kohli: KKRతో మ్యాచ్.. విరాట్ కోహ్లీకి జరిమానా!

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ పై పెద్ద వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో కోహ్లీకి భారీ జరిమానా విధించారు. ఆ వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ పై పెద్ద వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో కోహ్లీకి భారీ జరిమానా విధించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: KKRతో మ్యాచ్.. విరాట్ కోహ్లీకి జరిమానా!

దరిద్రంలో, దురదృష్టంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను బీట్ చేసే జట్టు లేదంటే అతిశయోక్తికాదేమో అనిపిస్తోంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా గెలుచుకోకుండా విమర్శల పాలవుతూ వస్తోంది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. విజయాలు సాధించడంలో పూర్తిగా విఫలం అవుతోంది. ఇది చాలదన్నట్లుగా ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’గా తయ్యారైంది ఆ టీమ్ పరిస్థితి. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కింగ్ విరాట్ కోహ్లీకి సైతం జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటి. దానికి కారణం ఏంటంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న(ఆదివారం) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలుతెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. దీంతో మరోసారి దురదృష్టం ఆర్సీబీని వెంటాడింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇది ఔటా? నాటౌటా? అని ఇప్పటకీ చాలా మందికి సందేహమే. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో తొలి బంతిని స్లో ఫుల్ టాస్ గా వేశాడు. ఆ బాల్ ను డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బాల్ గాల్లోకి లేచింది. దీంతో హర్షిత్ రాణా రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ కూడా ఇది అవుట్ గా ప్రకటించాడు. కానీ బంతి తన నడుము కంటే పైకి వచ్చిందని రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో సైతం థర్డ్ అంపైర్ కోహ్లీని ఔట్ గానే ప్రకటించాడు. బాట్ ఆడే క్రమంలో కోహ్లీ క్రీజ్ బయట ఉన్నాడు. అందుకే ఔట్ ఇచ్చామని అంపైర్లు వివరణ ఇచ్చుకున్నారు.

Kohli

ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అదే కోపంతో మైదానాన్ని వీడాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లీ అంపైర్ తో వాదించడంతో ఐపీఎల్ అడ్వైజరీ కమిటి అతడికి జరిమానా విధించింది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. దీంతో ఇప్పటికే తప్పుడు నిర్ణయం ద్వారా కోహ్లీ పెవిలియన్ చేరాడని బాధపడుతున్న ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మింగుడు పడటం లేదు. మరి కోహ్లీకి జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి