iDreamPost

వీడియో: RCB పరువు తీసిన వెంకటేశ్ అయ్యర్.. కోహ్లీ టీమ్ అని కూడా చూడకుండా..!

  • Published Apr 22, 2024 | 5:37 PMUpdated Apr 22, 2024 | 5:37 PM

కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంటకేశ్ అయ్యర్ ఆర్సీబీ పరువు తీశాడు. విరాట్ కోహ్లీ టీమ్ అని కూడా చూడలేదు అయ్యర్.

కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంటకేశ్ అయ్యర్ ఆర్సీబీ పరువు తీశాడు. విరాట్ కోహ్లీ టీమ్ అని కూడా చూడలేదు అయ్యర్.

  • Published Apr 22, 2024 | 5:37 PMUpdated Apr 22, 2024 | 5:37 PM
వీడియో: RCB పరువు తీసిన వెంకటేశ్ అయ్యర్.. కోహ్లీ టీమ్ అని కూడా చూడకుండా..!

ఐపీఎల్-2024లో మరో హైటెన్షన్ మ్యాచ్​కు ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలిచింది. కోల్​కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్​లో నిన్న థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతి వరకు విజేత ఎవరో చెప్పని పరిస్థితి. రెండు టీమ్స్ నువ్వా? నేనా? అంటూ తలపడుతూ ఆడియెన్స్​కు ఫుల్ కిక్ పంచాయి. అయితే ఎట్టకేలకు పట్టు సడలని కేకేఆర్ విజేతగా నిలిచింది. ఆర్సీబీ ఓడిపోయినా గానీ అందరి మనసులు దోచుకుంది. ఆ జట్టు పోరాడిన తీరు హైలైట్ అనే చెప్పాలి. తమ బెస్ట్ గేమ్​ను బయటపెడుతూ చివరి వరకు ఫైట్ చేశారు బెంగళూరు ఆటగాళ్లు. ఈ ఓటమితో డుప్లెసిస్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్​గా తప్పుకుంది. అయితే ఆ టీమ్​ పరువు తీశాడు కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్.

వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ.. నిన్న కేకేఆర్ మీదైనా నెగ్గి గాడిన పడుతుందనుకుంటే అది జరగలేదు. 1 పరుగు తేడాతో పరాజయం పాలైన బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఆ టీమ్ పరువు తీస్తూ వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడుతూ.. ఆర్సీబీ ఇంకా డేంజరస్ టీమే అన్నాడు. ఆ జట్టు బౌలింగ్ యూనిట్ బాగుందన్నాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అతడు నవ్వడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు బౌలింగ్ యూనిట్ గురించి చెప్పాక అతడు నవ్వాపుకోలేకపోయాడు. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్సీబీ బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడుతూ వెంకటేశ్ అయ్యర్ నవ్విన వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ టీమ్ అని కూడా చూడకుండా అతడు ఇలా పరువు తీయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. అయితే ఈ సీజన్​లో బెంగళూరు బౌలింగ్ యూనిట్ చెత్తగా ఉందని, వరుస ఓటములకు వాళ్లే కారణమని.. అలాంటి వాళ్ల గురించి గొప్పలా ఎలా చెప్పగలడని, అతడు నవ్వడంలో తప్పే లేదని మరికొందరు సమర్థిస్తున్నారు. ఒక్కోసారి కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఇలా జరగడం కామన్ అని, అయ్యర్​ కామెంట్స్, స్మైల్​ను సరదాగా తీసుకోవాలని ఇంకొందరు నెటిజన్స్ అంటున్నారు. ఏదేమైనా ఆర్సీబీ పరువు తీసేలా ఉన్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి.. బెంగళూరు బౌలర్ల గురించి మాట్లాడుతూ అయ్యర్ నవ్వడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి