iDreamPost

OTT ఈవారం ఓటీటీకి వ‌చ్చే మూవీస్/ వెబ్ సీరీస్

OTT ఈవారం ఓటీటీకి వ‌చ్చే మూవీస్/ వెబ్ సీరీస్


అమెజాన్ ప్రైమ్ amazon prime

లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బాగా న‌చ్చిన వారికి అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబ‌ర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న The Lord of the Rings: The Rings of Power క‌చ్చితంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది తెలుగులో రావ‌డం ఎక్కువ‌మంది ఆడియ‌న్స్ కి న‌చ్చే విష‌యం.

నెట్ ఫ్లిక్స్ netflix
ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో పెద్ద‌గా ఆక‌ట్టుకొనే సినిమాలు, సీరీస్ లు లేవు. కాని ఫ్యామిలీ సీక్రెట్స్ (వెబ్ సీరీస్)(Family Secrets) స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్ల‌ర్ ను ఇష్ట‌ప‌డేవాళ్లు ఈ సీరీస్ ను ఎంజాయ్ చేయొచ్చు.

I Came By వాచ్ చేయ‌ద‌గ్గ సినిమా. ఇది IMDbలో 6.4 రేటింగ్ సాధించింది. Rotten Tomatoesలో 64% యూజ‌ర్ రేటింగ్ సాధించిన సినిమా. మీ వీకెండ్ స్ట్రీమింగ్ లిస్ట్ లో ఉండాల్సిన మూవీ ఇది.

Under Her Control మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్పానిష్ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. ఒక బాస్ తో ఎక్కువ ఆశ‌లున్న ఒక అమ్మాయి చేసుకున్న ఎగ్రిమెంట్ ఈ సినిమా క‌థ‌.

జీ5 ZEE5
పాన్ ఇండియ‌న్ మూవీగా హిట్ కొట్టిన కిచ్చా సుదీప్ మూవీ, విక్ర‌మ్ రోనాను వాచ్ చేయడం ఓ అనుభూతి. కొత్త త‌ర‌హా క‌థ‌నం, కొత్త నేప‌థ్యం. ఓటీటీకి స‌రైన మూవీ. సెప్టెంబ‌ర్ 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ప్ర‌భుదేవ కొత్త‌గా క‌నిపించిన మై డియ‌ర్ భూతం సినిమాకూడా, జీ5లో సెప్టెంబ‌ర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాల‌ను ఫ్యామిలీతో క‌ల‌సి వాచ్ చేయ‌చ్చు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ (DisneyPlus Hotstar)
ఆసియా క‌ప్ కోసం ఇప్ప‌టికే కోట్ల మంది వాచ్ చేస్తున్న హాట్ స్టార్ లో, క‌ఠ్ పుత్లీ(హిందీ) సెప్టెంబ‌ర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగులో పెద్ద హిట్ అయిన రాక్ష‌సుడికి రిమేక్. అక్ష‌య్ కుమార్ ప‌క్క‌న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakulpreet Singh) యాక్ట్ చేసింది. ఓటీటీకి స‌రిగ్గా స‌రిపోయే థ్రిల్ల‌ర్.

హాట్ స్టార్ లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ KHUDA HAAFIZ 2 సెప్టెంబ‌ర్ 02 నుంచే స్ట్రీమింగ్ కానుంది. విద్యుత్ ఫైట్స్ కోసం ఓ లుక్ వేయండి.
ఆహా aha
ఈవీక్ లో ఆహా నుంచి చిన్న‌సినిమాలైనా ఇంట్రెస్టింగ్ కాన్స‌ప్ట్ తో వ‌స్తున్నాయి. ఆగ‌స్ట్ 31 నుంచి పంచ‌తంత్ర క‌థ‌లు స్ట్రీమింగ్ కానుంది.పెళ్లికూతురుపార్టీ కూడా ఆగ‌స్ట్31 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

సోనీ లివ్ SonyLIV
సుంద‌రి గార్డెన్స్( Sundari Gardens) సెప్టెంబ‌ర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన అప‌ర్ణ బాల‌మురళీ (Aparna Balamurali) కోసం ఈ మ‌ల‌యాళం సినిమాను వాచ్ చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి