iDreamPost

Vikram- Hotstar 400 కోట్ల సినిమా అప్పుడే ఓటిటిలో

Vikram- Hotstar 400 కోట్ల సినిమా అప్పుడే ఓటిటిలో

లోక నాయకుడు కమల్ హాసన్ కి తిరుగు లేని బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన విక్రమ్ ది హిట్ లిస్ట్ ఓటిటిలో వచ్చేస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లో విడుదలైన 35 రోజులకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు జూలై 8 నుంచి మీ ఇంట్లోనే ఈ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడొచ్చని డిస్నీ హాట్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించింది. నిజానికి ఈ న్యూస్ వారం క్రితమే లీకయ్యింది. కాకపోతే బాక్సాఫీస్ రన్ బాగున్న తరుణంలో డిజిటల్ విడుదల వాయిదా వేస్తారేమోనని అభిమానులు ఎదురు చూశారు. గతంలో అఖండకు అలాగే జరిగింది. కానీ విక్రమ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోకుండా ఉండేందుకు హాట్ స్టార్ ఇష్టపడలేదు.

దీని కోసం ప్రత్యేకంగా ప్రకటన కూడా విడుదల చేశారు. తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో వేర్వేరుగా షూట్ చేసిన ఒకే తరహా యాడ్ తో స్పెషల్ ప్రమోషన్ మొదలుపెట్టారు. విక్రమ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ ని దాటేసింది. తమిళనాడులో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. తెలుగులో కేవలం ఏడు కోట్లకు హక్కులు అమ్ముడుపోతే ఏకంగా 16 కోట్లకు పైగా రాబట్టి ఔరా అనిపించింది. ఈ దెబ్బకే పాజిటివ్ టాక్ వచ్చిన అంటే సుందరానికి షాక్ తినగా హిట్టు కొట్టిన మేజర్ కు సైతం మాస్ సెంటర్స్ లో ఇబ్బందులు తప్పలేదు. ఇంత సెన్సేషన్ చేసుకున్న విక్రమ్ ను త్వరగా ఓటిటిలో చూడటం కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది

తమిళంలో ఏమో కానీ మిగిలిన చోట్ల మాత్రం విక్రమ్ ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నాడు. హిందీలో డిజాస్టర్ కావడం ఊహించనిది. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ తరహాలో రిసీవ్ చేసుకుంటారనుకుంటే అక్కడ మాత్రం కమల్ మేజిక్ చేయలేకపోయాడు. కేరళ, కర్ణాటక వసూళ్లు ధీటుగా వచ్చాయి. ఈ ఒక్క సినిమా దెబ్బతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు మారుమ్రోగిపోతోంది. నెక్స్ట్ విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఒకరితో చేయొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మొత్తానికి నెలన్నర లోపే విక్రమ్ లాంటి గ్రాండ్ యాక్షన్ మూవీని స్మార్ట్ స్క్రీన్ మీద రావడమంటే వ్యూస్ పరంగా ఎన్ని రికార్డులు దక్కుతాయో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి