iDreamPost

విజయ్‌కాంత్ నా ప్రాణాలు కాపాడారు: విజయశాంతి

Vijayashanth, Captain Vijayakanth: కోలీవుడ్ స్టార్ హీరో,  తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్గా పేరు గడించిన విజయ్ కాంత్ గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన మృతికి మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

Vijayashanth, Captain Vijayakanth: కోలీవుడ్ స్టార్ హీరో,  తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్గా పేరు గడించిన విజయ్ కాంత్ గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన మృతికి మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్‌కాంత్ నా ప్రాణాలు కాపాడారు: విజయశాంతి

కోలీవుడ్ స్టార్ హీరో,  తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్గా పేరు గడించిన విజయ్ కాంత్ గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే.  ఆయన మృతితో డీఎండీకే కేడర్ ను, సినీ అభిమానులను శోక సంద్రంలో మునిగిపోయారు. తమ నేత  చివరి చూపు కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చెన్నైకి పోటెత్తారు. కెప్టెన్ గా పేరుగాంచిన విజయకాంత్ మృతిపై దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక కొందరు కోలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా భోరున విలపించారు. తాజాగా ఆయన మృతిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కాంత్ తన ప్రాణాలు కాపాడారని విజయశాంతి చెప్పుకొచ్చారు.

తమిళ టాప్ స్టార్.. దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డీఎండీకె) అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ కరోనాతో గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి విదితమే. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో  ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అంతలోనే మళ్లీ కరోనా అటాక్ చేసింది. దీంతో తిరిగి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.  దేశ ప్రధాని నరేంద్ర మోదీ .. విజయ్ కాంత్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

vijay shanti comments on vijay kanth

అలానే అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన వారు విజయక్ కాంత్ మృతికి సంతాపం తెలియజేశారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి విజయ్ కాంత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రాణాలను కాపాడారని గుర్తు చేసుకున్నారు. 1980లో ఓ సినిమా షూటింగ్ లో నన్ను ఓ తోటలో కట్టేసి, చుట్టూ మంట అంటించారు. పెద్ద గాలికి  ఆప్రాంతమంతా  అంటుకుంది. నా చేతులు కట్టేయడంతో తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో విజయ్ కాంత్ గారు ఎంతో కష్టపడినట్లు కట్లు విప్పి  నన్ను కాపాడారు. ఆయన ఎప్పటికీ  ప్రజల హీరో అని ట్వీట్ చేశారు.

కెప్టెన్ విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్ రాజ్ అళగర స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో జన్మించారు. ఆయన తండ్రి అళగర స్వామి రైస్ మిల్లు యజమాని. విజయ్ కాంత్ బాగా చదువుకోవాలని తండ్రి ఆశించాడు. కానీ, కెప్టెన్ మాత్రం సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. తమిళ ఆరాధ్య దైవం ఎంజీఆర్ సినిమాలను చూసి పెరిగిన ఆయన.. అతడిలా వెండితెరపై స్టార్ అవ్వాలని బలంగా కోరుకున్నాడు.

ఇక ఈ ప్రయత్నాల్లో భాగంగా మధురై నుండి చెన్నైకి మకాం మార్చారు విజయ్. ఇక సినిమా అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారట. ఎన్నో కష్టాలు పడి చివరకు స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాక, రాజకీయాల్లోకి ఎంట్రీ.. తనదైన మార్క్ ను చూపించారు. అలా సాగుతున్న కెప్టెన్ జీవితంలో అనారోగ్య సమస్యలు రావడంతో పరిస్థితి విషమించి.. గురువారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. హీరో విశాల్ అయితే విజయ్ కాంత్ ను తల్చుకుని భోరున విలపించాడు. మరి.. విజయ్ కాంత్ గురించి విజయశాంతి చెప్పిన విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి