iDreamPost

విజయ్ ఆంటోనీ కొత్త మూవీ ‘హిట్లర్’ టీజర్ ఎలా ఉందంటే?

Vijay Antony Hiter Movie Teaser: విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇప్పుడు హిట్లర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Vijay Antony Hiter Movie Teaser: విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇప్పుడు హిట్లర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విజయ్ ఆంటోనీ కొత్త మూవీ ‘హిట్లర్’ టీజర్ ఎలా ఉందంటే?

విజయ్ ఆంటోని.. ఈ పేరుకు టాలీవుడ్ లో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. నిజానికి సౌత్ సినిమాలో విజయ్ ఆంటోనికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తాను తీసే ప్రతి సినిమా ఒక సందేశనాత్మకంగా, ఆలోజింపచేసే విధంగా ఉంటుంది. తన సినిమాతో సమాజంలో ఏదో మార్పు తీసుకురావలి అనే తపన కనిపిస్తూ ఉంటుంది. అతను కేవలం హీరో మాత్రమే కాదు.. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, నిర్మాత ఇలా చాలానే క్రాఫ్ట్స్ లో ఆయనకు ప్రవేశం ఉంది. ముఖ్యంగా బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు హిట్లర్ గా మరోసారి పాన్ ఇండియా లెవల్లో రాబోతున్నాడు.

విజయ్ ఆంటోనీ నుంచి కొత్త సినిమా వస్తోంది అంటే ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు హిట్లర్ పేరిట మరో కొత్త ప్రాజెక్టుతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. నిజానికి టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఎన్నికలు, రాజకీయపార్టీల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డబ్బుతో సాగే రాజకీయాలు.. వాటి ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుంది అనే పాయింట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ హిట్లర్ సినిమాకి ధనా డైరెక్షన్ చేస్తుండగా.. విజయ్ ఆంటోనీ సరసన రియా సుమన్ నటిస్తోంది. గౌతమ్ మేనన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీళ్లు మాత్రమే కాకుండా చరణ్ రాజ్, రెడ్డిన్ కింగ్స్ లే, వివేక్ ప్రసన్న వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ లో అందరి దృష్టిని రెండు విషయాలు ఆకట్టుకుంటున్నాయి.

టీజర్ లో ఆకట్టుకున్న మొదటి మ్యూజిక్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. వివేక్- మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే తర్వాతది కెమెరా పనితనం. ఫ్రేమ్ చాలా కొత్తగా అనిపిస్తోంది. నవీన్ కుమార్ అద్భుతమైన కెమెరా వర్క్ అందిస్తారనే భరోసా కలిగించినట్లు కనిపించింది. ఇంక పదునైన డైలాగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. టీజర్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. “మనం యుద్ధానికి వాడబోయే ఆయుధాన్ని నిర్ణయించేది మన శత్రువే” ఈ మాటతో సినిమాలో పదునైన, సమాజాన్ని, రాజకీయ పార్టీలను ప్రశ్నించే రీతిలో డైలాగ్స్ ఉంటాయనే ఎక్స్ పెక్ట్ చేయచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ తెలిపారు. విజయ్ ఆంటోనీ అనగానే తెలుగు ప్రేక్షకుల బిచ్చగాడు సినిమానే గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ అయితే తెలుగులో చూపించలేదు. ఈ హిట్లర్ సినిమా ఆ తరహా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. మరి.. విజయ్ ఆంటోనీ కొత్త సినిమా హిట్లర్ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి