iDreamPost

క్రేజీ ఫ్రాంచైజ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న విద్యా బాలన్

  • Published Feb 13, 2024 | 2:22 PMUpdated Feb 13, 2024 | 2:22 PM

Vidya Balan Re Entry: ది డర్టీ పిక్చర్ మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన విద్యాబాలన్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.. ఈ క్రమంలోనే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.

Vidya Balan Re Entry: ది డర్టీ పిక్చర్ మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన విద్యాబాలన్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.. ఈ క్రమంలోనే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.

  • Published Feb 13, 2024 | 2:22 PMUpdated Feb 13, 2024 | 2:22 PM
క్రేజీ ఫ్రాంచైజ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న విద్యా బాలన్

రజినీకాంత్ – పి వాసు కాంబినేషన్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ చంద్రముఖి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఆ పైన హిందీలో అక్షయ్ కుమార్ రజినీ పాత్రలో, జ్యోతిక పాత్రలో విద్యా బాలన్ నటించగా ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే 2023 లో విడుదలయిన చంద్రముఖి 2 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. ఒరిజినల్ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటించారు. దర్శకుడు మళ్ళీ అదే కథతో వచ్చారు కానీ ఆ సినిమా అనుకున్న విధంగా విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చంద్రముఖిలో నటించిన జ్యోతిక, మలయాళం ఒరిజినల్ వెర్షన్ లో శోభన, కన్నడలో సౌందర్యలకు కంగనా ఏమాత్రం సరితూగలేదని పలువురు కామెంట్లు చేశారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ చంద్రముఖి మూడో భాగమైన భూల్ భులైయా 3 ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగంలో నటించిన విద్యాబాలన్ మూడవ భాగం కోసం తిరిగి వస్తున్నారు. భూల్ భులైయా 2 కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలవగా ఆ సినిమాలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించగా, టబు కూడా మరో ప్రథాన పాత్రను పోషించింది. ఇప్పుడు విద్యా బాలన్ తిరిగి రానుండటంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుంది.

నాగవల్లి, చంద్రముఖి 2 చిత్రాలతో పి వాసు సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ బాలీవుడ్ మేకర్స్ తెలివిగా ఆయన కథలకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీలోని సినిమాలకు సొంత కథలను సిద్ధం చేసుకున్నారు. భూల్ భులైయా 2 ఒరిజినల్ కథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందంటే మూడో భాగం ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఏడాది దీపావళికి ‘భూల్ భులయ్య 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘భూల్ భులైయా 3’తో విద్యాబాలన్ మనల్ని ఎలా భయపెడుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి