iDreamPost

టాలీవుడ్ యంగ్ హీరోలతో బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్దమౌతున్న రజినీ కాంత్

సంక్రాంతి సమయంలో మొదలైన థియేటర్ల రచ్చ.. దసరా, దీపావళి సమయంలో కూడా నెలకొనేటట్లుగా కనిపిస్తోంది. ముగ్గురు హీరోలతో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ సీనియర్ స్టార్.

సంక్రాంతి సమయంలో మొదలైన థియేటర్ల రచ్చ.. దసరా, దీపావళి సమయంలో కూడా నెలకొనేటట్లుగా కనిపిస్తోంది. ముగ్గురు హీరోలతో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ సీనియర్ స్టార్.

టాలీవుడ్ యంగ్ హీరోలతో బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్దమౌతున్న రజినీ కాంత్

జైలర్ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏజ్ ఈజ్ ఎ జస్ట్ ఎ నంబర్ మాత్రమేనని నిరూపిస్తున్నాడు ఈ స్టైలిష్ స్టార్. కానీ ఈ ఏడాది వచ్చిన లాల్ సలామ్ బాక్సాఫీసు వద్ద బెడిసి కొట్టిన సంగతి విదితమే. కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 9న విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు వర్సటైల్ డెరెక్టర్ జైం భీం ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్‌లో నటిస్తున్నాడు. ఇందులో అన్నీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పని చేస్తుండం విశేషం. అమితాబ్ బచ్చన్, పహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, రావు రమేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కడపతో పాటు హైదరాబాద్‌లో జరుపుకున్న సంగతి విదితమే.

తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ మంత్ ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. బిగ్ స్కెచ్చే వేసింది. అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక రజనీకాంత్ సినిమా అంటే తమిళంలో మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కావాల్సిందే. కానీ ఇదే నెలలో రెండు భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముందు నెలలో మరో ప్రాజెక్ట్ రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాల మధ్యలోనే వెట్టయాన్ కూడా విడుదల కాబోతుంది. దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనబడుతున్నాయి. అయితే సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీ విడుదల కాబోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర కూడా అదే నెలలో విడుదల కాబోతుంది.

అక్టోబర్ 10న థియేటర్లలో దేవర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది చిత్ర యూనిట్. అంతేకాకుండా రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కూడా ఈ నెలలో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కావచ్చునని బజ్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఈ సమయంలోనే సీనియర్ హీరో తన సినిమాతో రాబోతున్నాడు. ఈ లెక్కన యంగ్ హీరోలతో పోటీకి సిద్దమయ్యాడు ఈ సూపర్ స్టార్. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఇదే పోటీ నెలకొనగా.. తమిళ సినిమాలు తప్పుకుని తెలుగు సినిమాలకు అవకాశం ఇచ్చాయి. మరీ ఈ సారి కూడా ఇలాంటి వాతావరణం ఉంటుందో, లేదా డేట్ మారుతుందో వెయిట్ చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి