iDreamPost

ఆ దేవుడి నగలు మాయం నిజమే..

ఆ దేవుడి నగలు మాయం నిజమే..

తిరుమల తిరుపతి దేవస్థానం బొక్కసం నుండి నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారులు నిగ్గు తేల్చారు. అదృశ్యమైన ఆభరణాలు పునఃపరిశీలనలో కూడా దొరకలేదని అధికారులు నిర్ధారించారు. దీనిపై టిటిడి అధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలకు అనాదిగా భక్తులు మొక్కులు, కానుకల రూపంలో సమర్పించే ఆభరణాలను పరిశీలించి తిరువాభరణం (రికార్డు) లో నమోదు చేసి బొక్కసం (ట్రెజరీ) భద్రపరుస్తారు. అయితే 2016 లో బొక్కసం ఏఈఓ గా ఉన్న శ్రీనివాసులు బదిలీ అయిన సమయంలో నగల వివరాలను పరిశీలించగా అందులో 5.40 కిలోల వెండి కిరీటం, బంగారు నాణేలు, వెండి పూత పూసిన రాగి నాణేలు, రెండు బంగారు ఉంగరాలతో పాటు రెండు నక్లెస్ లు మాయామయినట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ 7,36,376 లుగా అధికారులు లెక్క తేల్చారు. దీనికి అప్పటి ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులునే భాధ్యుడుగా పేర్కొంటూ, నష్టపరిహారం కింద 2018 నుండి అతని జీతంలో నెలకి 25 వేల రూపాయలను అపరాధ రుసుం కింద టిటిడి వసూలు చేస్తుంది.

Read Also: జగన్ కి కృతజ్ఞతలు చెప్పిన తమిళనాడు ముఖ్యమంత్రి

అయితే నగదు గల్లంతులో తనకి సంభందం లేదని, మరోమారు ట్రెజరీలో ఆభరాణాలని పునఃపరిశీలించాలని శ్రీనివాసులు 6 నెలల క్రితం టిటిడి ఉన్నతధికారులను కోరాడు. అతని అభ్యర్ధన మేరకు టిటిడి అధికారుల్లో ట్రెజరీలో ఆభరణాల లెక్కలని గత సెప్టెంబర్ నుండి పునఃపరిశీలిన ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. అయితే గతంలో కనిపించకుండా పోయిన ఆభరణాలు బొక్కసం నుండి గల్లంతయ్యాయని అధికారులు నిర్ధారించారు. దీనితో ఏఈఓ శ్రీనివాసులు నుండి జరిమానా వాసులును కొనసాగించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి టిటిడి అధికారులు సిద్ధమైయ్యారు.

శ్రీవారి నగలు మాయామైన అంశంపై 2017 లో బిజెపి సీనియర్ నాయకుడు, టిటిడి మాజీ బోర్డు సభ్యుడయిన జి భాను ప్రకాష్ రెడ్డి శ్రీవారి ఆలయ బొక్కసంలో ఆడిటింగ్ కి సంభందించిన కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చెయ్యడంతో ఈ వార్త తొలిసారి వెలుగులోకి వచ్చింది. బొక్కసంలో గల్లంతయిన ఆభరణాలపై దర్యాప్తు జరపాలని, దీనికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అప్పట్లో టిటిడి ని డిమాండ్ చేశారు. దానితో భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రధాన కార్యానిర్వాహణాధికారి అనిల్ సింఘాల్ దీనిపై సమగ్ర విచారణకి ఆదేశించారు. బొక్కసంలో కొన్ని నగలు గల్లంతయిన విషయం వాస్తవమేనని అధికారులు గుర్తించారు.

Read Also: మనసున్న మా”స్టారు”…

ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న శ్రీనివాసులు 2013 నుండి బొక్కసం ఏఈవో గా భాద్యతలు స్వీకరించారు. దానితో ఈ 2013 సంవత్సరం నుండి ఆడిటింగ్ నిర్వహించినట్టు టిటిడి ఈఓ అనిల్ సింఘాల్ తెలిపారు. 2013 నాటికి టిటిడి దగ్గర 20,602 కేజీల వెండి ఉందని, భక్తుల నుండి టిటిడి కి ప్రతి సంవత్సరం 2,600 నుండి 3,000 కిలోల వెండి విరాళాలు కానుకలు రూపంలో అదనంగా చేరుతుందని దానితో పాటు హుండీ రూపంలో 3 వేల కిలోలు వెండి వస్తువులు ట్రెజరీకి వచ్చి చేరుతున్నట్టు, 2016 నాటికి టిటిడి దగ్గరగా షుమారుగా 28 టన్నుల వెండి ఆభరణాలు ఉన్నాయని సింఘాల్ తెలిపారు. కాగా బొక్కసం నుండి గల్లంతయిన వెండి కిరీటం 2002లో ఒక అజ్ఞాత భక్తుడు శ్రీవారికి కానుకగా ఇచ్చిన్నట్టు సింఘాల్ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి