iDreamPost

OTTలో కూడ రచ్చ చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ బేబీ..

OTTలో కూడ రచ్చ చేస్తున్న బ్లాక్  బస్టర్ మూవీ బేబీ..

బేబీ” ఈ మధ్య కాలంలో పెద్ద విజయాన్ని అందుకున్న చిన్న సినిమా ఇది.  రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా 90కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కథ, కథనం అంతా నేటి యువత మానసిక స్థితిని తెలియజేస్తూ ఉండటం, వారికి కనెక్ట్ అయ్యే రీతిలో మూవీని తెరకెక్కించడం “బేబీ” విజయానికి కారణం అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బహ్మరథం పట్టారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. సినీ లవర్స్ తో పాటు థియేటర్లో చూసిన వాళ్లు కూడా ఓటీటీల చేసేందుకు ఎంతగానే ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో విడుదలైన బేబీ.. ఇక్కడ కూడ దుమ్ములేపుతుంది.

బేబీ..చిన్న సినిమాగా రిలీజ్ అయి.. ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ మూవీ కోసం సినీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు శ్రీనివాస కుమార్ నిర్మాతగా వ్యవహిరించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటన అద్భుతంగా ఉంది.

అలానే ఇక ఈ సినిమా సక్సెస్ తో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. జూలై 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆహా లో  బేబీ సినిమా స్ట్రీమి అవుతోంది.  24 తేదీన అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి 12 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మీరు గనుక ఈ సినిమాను థియేటర్లలో చూసినా, చూడకపోయినా.. మరోసారి ఓటీటీలో చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి