iDreamPost

నాని ‘వి’కి కొత్త సమస్య

నాని ‘వి’కి కొత్త సమస్య

కరోనా తాలూకు ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. జనజీవనం ఎప్పుడు మాములు స్థితికి చేరుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడం లేదు. థియేటర్లు మూతబడి రెండు వారాలు దాటేసింది. లాక్ డౌన్ పుణ్యమాని అవి మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మైంటెనెన్స్ స్టాఫ్ లేక లోపల సీట్లు, ఎక్విప్మెంట్, ఏసీలు ఏ కండిషన్ లో ఉంటాయో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తోంది.

ఒకవేళ ఏప్రిల్ 14 తర్వాత ఓపెన్ చేసేందుకు అనుకూల పరిస్థితులు వస్తే ఓకే. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కోవిడ్ 19 రాకముందు రిలీజ్ ఆగిపోయిన వాటిలో ముందున్నది నాని వి. మార్చ్ 25 ప్లాన్ చేసుకుంటే ఈ వైరస్ వల్ల మొదట ఆగిపోయింది ఇదే. ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో చూసుకున్నా విడుదల చేయాల్సింది దీన్నే. కానీ ఈ పరిణామాలు వికి ఎంత ప్లస్ అవుతాయి ఎంత మైనస్ అవుతాయన్నది అంతు చిక్కడం లేదు. ఉదాహరణకు ఏప్రిల్ చివరి వారంలో సినిమా హాళ్లు తీశారు అనుకుందాం.

అప్పటికి వైరస్ టెన్షన్ కొంత తగ్గినా జనం సమూహంలోకి రావడానికి జంకుతారు. అందులోనూ అపరిచితులతో పక్కపక్కనే కూర్చోవాల్సి వచ్చే థియేటర్లకు రావడం అనుమానమే. ఒకవేళ ఇలా జరిగితే నాని వి కి ఓపెనింగ్స్ పరంగా చిక్కులు వస్తాయి. లేదూ చాలా కాలం అయ్యింది పెద్ద తెరమీద సినిమా చూసి అని పబ్లిక్ అదేపనిగా థియేటర్లకు వస్తే నాని వి కి బ్రహ్మాండమైన స్టార్ట్ వస్తుంది. ఇదంతా ఆ సమయానికి జనం మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం సైతం ఇంకే భయం లేదని హామీ ఇస్తే తప్ప జనం సినిమాలకు వచ్చేలా లేదు. దీనికి ఎక్స్ పెరిమెంట్ గా నాని వినే నిలబడబోతోంది. కాకపోతే డేట్ ఏదీ అని ఎవరూ చెప్పలేకపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి