iDreamPost

Utkarsha Pawar: విమెన్​ క్రికెట్​లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ భార్య!

  • Published Jan 24, 2024 | 4:46 PMUpdated Jan 24, 2024 | 4:50 PM

ఒక టీమిండియా స్టార్ క్రికెటర్ ఇంటర్నేషనల్ లెవల్లో దుమ్మురేపుతున్నాడు. అయితే ఆ ప్లేయర్​తో పాటు అతడి భార్య కూడా క్రికెట్​లో సత్తా చాటుతుండటం విశేషం. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక టీమిండియా స్టార్ క్రికెటర్ ఇంటర్నేషనల్ లెవల్లో దుమ్మురేపుతున్నాడు. అయితే ఆ ప్లేయర్​తో పాటు అతడి భార్య కూడా క్రికెట్​లో సత్తా చాటుతుండటం విశేషం. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 24, 2024 | 4:46 PMUpdated Jan 24, 2024 | 4:50 PM
Utkarsha Pawar: విమెన్​ క్రికెట్​లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ భార్య!

ఐపీఎల్ చాలా మంది కొత్త కుర్రాళ్లను టీమిండియాకు అందించింది. అందుకే ఈ లీగ్ మీద సెలక్టర్లు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్​లో రాణించిన వారి కంటే ఐపీఎల్​లో బాగా పెర్ఫార్మ్ చేసిన వారికే భారత జట్టులోకి వెళ్లడం ఈజీగా మారింది. అందుకే రంజీల్లో బాగా ఆడిన వారు కూడా క్యాష్ రిచ్​ లీగ్ మీద స్పెషల్​గా కాన్​సంట్రేట్ చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి ఏటా కొందరు క్రికెటర్లు జాతీయ జట్టులోకి వస్తున్నారు. అయితే వారిలో ఏ ఒకరిద్దరో మాత్రమే టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా మారుతున్నారు. ఇచ్చిన అవకాశాల్ని వాడుకొని నిరంతరం రాణించే వారికి టీమ్ మేనేజ్​మెంట్ అండగా ఉంటోంది. అలా బాగా ఆడి మంచి ప్లేయర్​గా పేరు తెచ్చుకున్న వారిలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. ఐపీఎల్​లో సీఎస్​కే తరఫున ఆడుతూ టీమిండియా టికెట్ సాధించాడు రుతురాజ్. టీ20ల్లో ఓపెనింగ్​లో అదరగొడుతూ కీలక ప్లేయర్​గా ఎదుగుతున్నాడు. అయితే రుతుతో పాటు అతడి భార్య కూడా క్రికెట్​లో అదరగొడుతోంది.

ఇటీవల కాలంలో భారత క్రికెట్​లో రుతురాజ్ గైక్వాడ్ పేరు బాగా వినిపిస్తోంది. దీనికి కారణం అతడి అద్భుతమైన బ్యాటింగే. ఓపెనర్​గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే అతడికి మంచి అవకాశాలు ఇస్తోంది టీమ్ మేనేజ్​మెంట్. రోహిత్ తర్వాత ఓపెనింగ్ పొజిషన్​కు శుబ్​మన్ గిల్​తో పాటు రుతురాజ్​ కూడా పోటీలో ఉన్నాడు. అలాంటి ఈ స్టైలిష్ బ్యాటర్​ భార్య కూడా క్రికెటర్ అనే విషయం చాలా మందికి తెలియదు. రుతు వైఫ్​ ఉత్కర్ష పవార్ మహారాష్ట్ర తరఫున క్రికెట్​లో దుమ్మురేపుతోంది. సీనియర్ విమెన్స్ ఓడీఐ కప్​లో భాగంగా మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఉత్కర్ష కూడా ఆడింది. 8 ఓవర్లు వేసిన ఆమె 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆమె ఒక మెయిడిన్ కూడా వేయడం విశేషం. ఈ పెర్ఫార్మెన్స్​పై భర్త రుతురాజ్ నుంచి ప్రశంసలు అందుకుంది ఉత్కర్ష. ఆమె మ్యాచ్ ఆడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు రుతురాజ్.

ఉత్కర్ష రెండేళ్ల నుంచి మహారాష్ట్ర సీనియర్ జట్టుకు ఆడుతోంది. మీడియం పేస్ బౌలర్​ అయిన ఆమె తనకు దొరికిన అవకాశాలు వినియోగించుకొని మంచి పేరు తెచ్చుకుంది. బౌలింగ్​లో మరింత ఇంప్రూవ్ అయితే ఆమె త్వరలోనే భారత మహిళల జట్టులో ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనలిస్టులు అంటున్నారు. ఇక, రుతురాజ్-ఉత్కర్షలు కొన్నాళ్లు లవ్ చేసుకున్నాక పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్ల మ్యారేజ్ 2023, జూన్ 3వ తేదీన జరిగింది. ఆ టైమ్​లో వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​కు సెలక్ట్ అయ్యాడు రుతురాజ్. కానీ పెళ్లి కారణంగా ఇంగ్లండ్​కు వెళ్లలేకపోవడంతో అతడి ప్లేస్​లో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్​ను రీప్లేస్ చేసింది బీసీసీఐ. ఇక, పెళ్లికి ముందే ఐపీఎల్​లో పలు మ్యాచుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఉత్కర్ష. ఆ సీజన్ ఫైనల్​లో సీఎస్​కే గెలిచాక మహేంద్ర సింగ్ ధోనీతో కలసి రుతురాజ్-ఉత్కర్ష ఫొటోలు దిగారు. మరి.. రుతురాజ్​తో పాటు అతడి భార్య కూడా క్రికెట్​లో సత్తా చాటుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి