iDreamPost

వీడియో: కారుతో యువతి స్టంట్.. బోల్తాకొట్టి ఐదుగురి పరిస్తితి..

ఈ మద్య కొంతమంది యువతీ యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ప్రాణాలకు తెగించి బైక్, కార్ స్టంట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడమేకాదు.. ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు.

ఈ మద్య కొంతమంది యువతీ యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ప్రాణాలకు తెగించి బైక్, కార్ స్టంట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడమేకాదు.. ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు.

వీడియో: కారుతో యువతి స్టంట్.. బోల్తాకొట్టి ఐదుగురి పరిస్తితి..

ఈ మధ్య కాలంలో జనాలు ఇంటి నుంచి బయటికి వస్తే.. క్షేమంగా ఇంటికి చేరుతామా? లేదా? అన్న ఆందోళప కొనసాగుతుంది. వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కొంతమంది యువతీయువకులు బైక్, కార్లతో స్టంట్స్ చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి స్టంట్స్ తో వారి ప్రాణాలు మాత్రమే కాదు.. ఇతరుల ప్రాణాలు కూడా రిస్క్ లో పెడుతున్నారు. బైక్ స్టంట్స్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఓ యువతి కారు స్టంట్ పలువురి ప్రాణాల మీదకు తెచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రాణాలకు తెగించి మరీ కారు, బైక్ స్టంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ యువతి కారుతో స్టంట్ చేయబోయి పెను ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది.. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యూత్ పాపులారిటీ కొసం రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బైక్, కారు స్టంట్స్ చేస్తూ సాహసాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రమాదంలో పడటమే కాదు.. ఇతరులు ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తరుచూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. అమెరికాలో ఓ యువతి డేంజరెస్ డ్రైవ్ చేసి తన స్నేహితుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టింది.

కొలరాడో స్ప్రింగ్స్ లోని ఓ గ్రౌండ్ యువతి ఎస్‌యూవీ కారును వెనక్కి స్పీడ్ గా నడిపింది.. అదే సమయంలో యువతీయువకులు కారు డోర్లపై వేలాడుతూ కేరింతలు కొడుతూ ఉన్నారు. కారు వెనక్కి వచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారులో వేలాడుతున్న వారు కారుకింద పడి నలిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రమాదానికి కారణం అయిన యువతిని అరెస్ట్ చేశామని, నిర్లక్ష్యపు డ్రైవ్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో యువతికి స్వల్ప గాయాలు కాగా.. మిగతా వారికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి