iDreamPost

ఎన్‌కౌంటర్‌లో నేరస్థుడు హతం! అతని కూతురి పెళ్లిచేసిన పోలీసులు!

  • Published Mar 07, 2024 | 2:45 PMUpdated Mar 07, 2024 | 2:45 PM

సమాజంలో ఖాకీలంటే రక్షించేవాలు ఉంటారు, కర్కశత్వంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఉంటారు. కానీ అలాంటి వాటికి భిన్నంగా కొందరు ఖాకీలు మాత్రం చేసిన సాయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సమాజంలో ఖాకీలంటే రక్షించేవాలు ఉంటారు, కర్కశత్వంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఉంటారు. కానీ అలాంటి వాటికి భిన్నంగా కొందరు ఖాకీలు మాత్రం చేసిన సాయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Mar 07, 2024 | 2:45 PMUpdated Mar 07, 2024 | 2:45 PM
ఎన్‌కౌంటర్‌లో నేరస్థుడు హతం! అతని కూతురి పెళ్లిచేసిన పోలీసులు!

ఏ ఇంట్లో అయిన ఆడపిల్ల ఉంటే ఎన్నో బాధ్యతలు, మరెన్నో బరువులు మోయాల్సి ఉంటుంది. మరి అలాంటి ఆడపిల్ల విషయంలో తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే.. ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆమె పెరిగి పెద్ద అయ్యో వరకు తండ్రి ఒక సంరక్షకుడిగా నిరంతరం పని చేస్తాడు. మరి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురికి సంబంధించి ఏ కార్యక్రమం అయిన..తానే దగ్గరుండి జరిపించాలని ప్రతిఒక్క తండ్రీ కలలు కంటాడు. కానీ, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు ఇది చాలామందికి సాధ్యమయ్యే పని కాదు. కానీ, ఓ పేదింటికి చెందిన యువతికి తండ్రి బాధ్యతగా నిలబడి చేయావల్సిన ముఖ్యమైన ఘట్టాన్ని తండ్రి స్థానంలో నిలబడి ఖాకీలు దగ్గరుండి జరిపించారు. అలాగే ఆ పేదింటి యువతికి తన తండ్రి లేని లోటును తీర్చి అండగా నిలిచారు. అసలేం జరిగిదంటే..

సమాజంలో ఖాకీలంటే రక్షించేవాలు ఉంటారు, కర్కశత్వంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఈ రెండింటికి భిన్నంగా మానవత్వంతో.. సాయం చేసే మంచి మనుసున్న వాళ్లు కూడా ఉంటారు. అచ్చం అలానే ఓ నేరస్థుడి కూతురి పెళ్లిని పోలీసులు అన్నీ తామై ఘనంగా జరిపించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. 2023 మే 10న ఉరయీ జిల్లా కానిస్టేబుల్ భేద్జిత్‌సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు.ఈ కేసులో నిందితులైన రమేష్‌ రైక్వార్‌, కల్లు అహిర్వార్‌లను నాలుగు రోజుల తర్వాత పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే, రమేష్‌‌ది చాలా పేద కుటుంబం కావడం, ఇద్దరు కుమార్తెల బాధ్యత కూడా ఉన్నారు. అలాగే సంపాదించి ఆర్ధికంగా నిలబడలసిన వ్యక్తిని కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. దీంతో అప్పటిలో వారికి అండగా ఉంటామని అప్పట్లో పోలీసులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. రమేశ్ పెద్ద కుమార్తె శివానీకి..న్సీకి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో పోలీసులంతా కలిసి రమేశ్ భార్య తారా గైక్వార్.. పెళ్లికి సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన పోలీసులు విరాళాలు వేసుకొని, మరికొంత దాతల నుంచి సేకరించారు.

ఈ క్రమంలోనే నూతన వధూవరులకు కానుకగా బైక్, ఇతర గృహోపకరణాలతో పాటు నగలను కూడా ఇచ్చి మార్చి 2న ఘనంగా పెళ్లిచేసి అత్తవారింటికి సాగనంపారు.అలాగే విందు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంగా.. సర్కిల్ అధికారి గిరిజా శంకర్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నేరస్థుడు రమేష్ రైక్వార్ కుటుంబం చాలా దయనీయమైన స్థితిలో జీవిస్తున్నారు. వారికి ఇంట్లో ఏమీ లేదు, ఇద్దరు కూతుళ్లు పెళ్లిళ్లు చేయాలి.. సంపాదించే వ్యక్తి లేడు. ఇది మా అందరినీ ఎంతగానో కదిలించింది. అందుకే ఆ కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చాం. అలాగే ఇద్దరు కుమార్తెల వివాహానికి అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా, ఆ బాధ్యతను నిర్వర్తించాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త స్థానికంగా వైరల్ కావడంతో.. అన్యాయంగా లంచాలు తీసుకొనే పోలీసులు ఉన్న ఈ రోజుల్లో ఇచ్చిన మాటాకు కట్టుబడి నిలబడిన ఈ పోలీసులను చూస్తే గర్వంగా ఉందని, ఆ పోలీసులకు హ్యాట్సఫ్  చెబుతున్నారు.

ఇక తండ్రి లేకపోయినా ఎటువంటి లోటు లేకుండా వైభవంగా వివాహం జరిపించిన పోలీసులకు.. యువతి కృతజ్ఞతలు తెలిపింది. తన జీవితంలో మరపురాని క్షణాలను ఆనందంగా మలచిన వారికి తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలని ఉద్వేగానికి గురయ్యింది. అలాగే రమేశ్ భార్య సైతం పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసింది. ‘తన భర్త చనిపోవడంతో కుటుంబం దయనీయ పరిస్థితిలోకి వెళ్లింది. ఆ సమయంలో నేను కూడా నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. కానీ, పోలీసులు నాలో స్థైర్యాన్ని నింపి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. తాను కోరగానే పెళ్లి దగ్గరుండి జరిపించారు’. అని చెప్పుకొచ్చింది. మరి, తండ్రి లేని యువతికి ఖాకీలే దగ్గరుండి పెళ్లి జరిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి