iDreamPost

వీడియో: రైలు ఎక్కేందుకు.. ప్లాట్​ఫామ్​ పైకే కారును తీసుకెళ్లిన మంత్రి!

  • Author singhj Published - 03:40 PM, Thu - 24 August 23
  • Author singhj Published - 03:40 PM, Thu - 24 August 23
వీడియో: రైలు ఎక్కేందుకు.. ప్లాట్​ఫామ్​ పైకే కారును తీసుకెళ్లిన మంత్రి!

ఇప్పుడు అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారిపోయాయి. పొద్దున లేస్తే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ అందరూ బిజీబిజీగా అయిపోతున్నారు. పనిభారం ఎక్కువగా అయిపోయిన ఈ కాలంలో సమయపాలన చాలా ముఖ్యమనే చెప్పాలి. ఏ పనైనా టైమ్​కు చేయాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. సమయపాలన సరిగా లేకపోవడం, ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిర్ణీత సమయానికి ముందే అనుకున్న పనులను పూర్తి చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు. సమయపాలనను పిల్లలకు కూడా అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏ పనిని ఆ టైమ్​కు చేయకపోవడం వల్ల అన్ని పనులూ ఒకేసారి తల మీద పడతాయి. సమయపాలనను ఇంట్లోని పెద్దవారు పిల్లలకు అలవాటు చేయాలి. ప్రజలే కాదు.. ప్రభుత్వ అధికారులు, అధికారంలో ఉన్న నేతలు కూడా సమయపాలనను సరిగ్గా పాటించాలి. అప్పుడే వారిని చూసి అందరిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అభాసుపాలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడో మంత్రి పరిస్థితి అలాగే ఉంది. రైల్వే స్టేషన్​లోని ప్లాట్​ఫామ్​ పైకి ఓ మంత్రి తన కారుతో దూసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రి ధరమ్​పాల్ సింగ్ సైసీ బరేలీకి వెళ్లాల్సి ఉంది.

హౌరా-అమృత్​సర్ ఎక్స్​ప్రెస్​లో బరేలీకి వెళ్లాలని మంత్రి ధరమ్​పాల్ నిర్ణయించుకున్నారు. కానీ ట్రైన్ వెళ్లే టైమ్​కు ఆయన స్టేషన్​కు చేరుకోలేకపోయారు. దీంతో ఎక్కడ రైలు మిస్సవుతుందోనని స్టేషన్​కు హడావుడిగా వచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర కారును పార్క్ చేయాల్సిన ఆయన ఆపకుండా లోపలకు వెళ్లారు. అంతేగాక దివ్యాంగుల కోసం వాడే వీల్​చైర్ ర్యాంప్​ పైకి తన కారును ఎక్కించి ప్లాట్​ఫామ్​కు చేరుకున్నారు మంత్రి ధరమ్​పాల్. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంత్రి అయినంత మాత్రాన స్టేషన్​లోకి ఇలా వస్తారా? ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ప్యాసింజర్లు ఆయనపై సీరియస్ అవుతున్నారు. ప్లాట్​ఫామ్​పై నడుచుకుంటూ వెళ్తే ఆయన సొమ్మేం పోతుందని విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి