iDreamPost

వీడియో: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవదహనం!

  • Published Dec 10, 2023 | 11:20 AMUpdated Dec 10, 2023 | 11:20 AM

పెళ్లి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పలకరించింది. కారులో మంటలు చెలరేగడంతో.. వారంతా దానిలోనే సజీవదహనం అయ్యారు. ఆ వివరాలు..

పెళ్లి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పలకరించింది. కారులో మంటలు చెలరేగడంతో.. వారంతా దానిలోనే సజీవదహనం అయ్యారు. ఆ వివరాలు..

  • Published Dec 10, 2023 | 11:20 AMUpdated Dec 10, 2023 | 11:20 AM
వీడియో: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవదహనం!

వారంతా ఎంతో సంతోషంగా పెళ్లికి వెళ్లి వస్తున్నారు. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారు. దారంతా పెళ్లిలో జరిగిన సంఘటనల గురించే చర్చించికుంటూ కబుర్లలో మునిగిపోయారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటాము అనగా.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని పలకరించింది. ఈ దారుణంలో చిన్నారి సహా 8 మంది చనిపోయారు. ఈ విషాదకర సంఘటన శనివారం రాత్రి.. ఉత్తరప్రదేశ్, బరేలి నైనిటాల్ హైవే మీద చోటు చేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది అంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

“భోజిపురా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కార్‌.. ట్రక్‌ని బలంగా ఢీకొట్టడమే కాక కొంత దూరం వరకూ.. కార్‌ని ట్రక్‌ లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో టైర్ పేలిపోయింది. దాంతో కార్‌లో మంటలు చెలరేగాయి. పైగా సెంట్రల్ లాక్‌ వేయడం వల్ల డోర్‌లు ఓపెన్ కాలేదు. లోపల ఉన్న వాళ్లంతో మంటల్లో కాలిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించాము. మృతదేహాలనూ బయటకు తీశాం. మొత్తం 8 మంది చనిపోగా.. వారిలో ఓ చిన్నారి డెడ్‌బాడీ కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగుతుంది.. పూర్తి వివరాలు వెల్లడిస్తాము” అని చెప్పుకొచ్చారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం ధాటికి కారు, ట్రక్కు రెండు మంటల్లో కాలి బూడిదయ్యాయి అన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందడంతోనే.. 4 వాహనాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు, ట్రక్కుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. కారు నంబర్ ప్లేట్‌ ఆధారంగా అది బహేరీలోని రాంలీలా మొహల్లాలో నివాసముంటున్న సుమిత్ గుప్తాకు చెందినదని తేలింది.

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే సరికి కారులో సీట్లపై అస్థిపంజరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని చూసి అధికారులు, ప్రత్యక్ష సాక్షులు భయభ్రాంతులకు గురయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి