iDreamPost

ప్రచార రథానికి కరెంట్ షాక్.. అమిత్ షాకు తప్పిన ప్రమాదం!

  • Published Nov 08, 2023 | 12:53 PMUpdated Nov 08, 2023 | 12:53 PM

ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నాయి. రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ స్థాయి నేతలు ప్రచారాలకు హాజరవుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నాయి. రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ స్థాయి నేతలు ప్రచారాలకు హాజరవుతున్నారు.

  • Published Nov 08, 2023 | 12:53 PMUpdated Nov 08, 2023 | 12:53 PM
ప్రచార రథానికి కరెంట్ షాక్.. అమిత్ షాకు తప్పిన ప్రమాదం!

గత నెల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే దేశంలోని ప్రధాన పార్టీలు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. నిన్న మిజోరాం, చత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కోసం కేంద్రం నుంచి అధికార, ప్రతిపక్ష జాతీయ అధినేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ప్రచారం చేస్తున్న సమయంలో కొన్నిసార్లు అపశృతులు జరుగుతుంటాయి. వెంటనే సిబ్బంది అలర్ట్ కావడంతో నేతలు ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. కేంద్ర హూం శాఖా మంత్రి అమిత్ షా కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రాజస్థాన్ లో ప్రచారం చేస్తున్న సమయంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక సందడి మొదలైంది. నిన్న చత్తీస్ గఢ్, మిజోరాం లో ఎన్నికలు జరిగాయి. ఇక రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా కు పెద్ద ప్రమాదం తప్పింది. నాగౌర్ నియోజకవర్గంలో బిడియాద్ గ్రామం నుంచి పర్బత్ సర్ వైపు వెళ్తున్న ప్రచార రథానికి విద్యుత్ తీగలు తగిలి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. రోడ్డుకు ఇరు వైపులా ఇళ్లు, షాపులు ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు. వెంటనే అమిత్ షాను సురక్షితంగా కిందకు దింపి వేరే కారులో అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటనలో అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దివానా కుచమన్ జిల్లాలోని నవాన్, పర్బత్ సర్, మక్రానా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం కుచమన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని అనంతరం మక్రానాలో ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి ప్రచార రథం ఎక్కి పర్బత్ సర్ కు చేరుకున్నారు. అక్కడ సాంద్ చౌక్ సమీపంలోకి రాగానే ఎల్ టీ విద్యుత్ లైన్ వైర్ రథం పై పడటంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగాయి. అమిత్ షా వాహనం వెనుక అన్ని వాహనాలు అప్రమత్తం చేశారు. వెంటనే కరెంట్ సరఫరాను నిలిపి వేశారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయనను సురక్షితంగా వేరే కారులో పంపారు. ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. కేంద్ర మంత్రి అమిత్ షా కు ప్రమాదం తప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ విచారణకు ఆదేశాలు ఇస్తామని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి