iDreamPost

కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు శుభవార్తను అందించింది. కొబ్బరికి మద్దతు ధర కల్పించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొబ్బరి రైతులకు ప్రయోజనం చేకూరనున్నది.

కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు శుభవార్తను అందించింది. కొబ్బరికి మద్దతు ధర కల్పించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొబ్బరి రైతులకు ప్రయోజనం చేకూరనున్నది.

కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

దేశంలోని పలు రాష్ట్రాల్లోని రైతులు కొబ్బరి సాగు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేసే కొబ్బరికి మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటుంది. కానీ అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొబ్బరి సాగు చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంట దిగుబడి సరిగా రాక సాగు ఖర్చు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో కొబ్బరి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు శుభవార్తను అందించింది. కొప్రా ఎంఎస్పీని క్వింటాల్ కు రూ. 300 పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ధరతో మిల్లింగ్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.10860 నుంచి రూ.11160కి పెరిగింది. మరోవైపు.. బాల్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.11750 నుంచి రూ.12000కి పెంచారు. కాగా కొబ్బరి పొడి భాగాన్ని కొప్రా అంటారు. పెంచిన ధరల ద్వారా దేశంలోని కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొబ్బరికి మద్దతు ధర పెంచడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొబ్బరిని ఆహార పదార్థాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

అంతే కాకుండా కొబ్బరి నూనె తయారీలో కూడా కొబ్బరిని వినియోగిస్తారు. ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల, ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఎండు కొబ్బరి తింటే రక్తహీనత పోతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ని కూడా పెంచుతుంది. కొబ్బరి నీళ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి మద్దతు ధర పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి