iDreamPost

బాబు వెన్నులో వణుకు పుట్టించిన ఉండవల్లి?

ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ అంశాలపై కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. అలాంటి ఉండవల్లి తన పిటిషన్లతో చంద్రబాబు వెన్నులో కూడా వణుకు పుట్టించారనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ అంశాలపై కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. అలాంటి ఉండవల్లి తన పిటిషన్లతో చంద్రబాబు వెన్నులో కూడా వణుకు పుట్టించారనే టాక్ వినిపిస్తోంది.

బాబు వెన్నులో వణుకు పుట్టించిన ఉండవల్లి?

ఉండవల్లి అరుణ్ కుమార్…రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూనే వాటికి సంబంధించిన అంశాలపై తరచూ మీడియా ముందుకు వస్తుంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నాయకుడే కాక ముందే న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికే పలు అంశాలపై కోర్టుల్లో ఆయన పిటిషన్లు వేస్తుంటారు. ఇప్పటికే  అలా  ఎన్నో పిటిషన్లు వేసి చాలా మంది వెన్నులో వణుకు పుట్టించారు. ఇతనేందిరా బాబు మనల్ని తగులుకున్నాడు అనేంతలా.. అవినీతిపై ఉండవల్లి పోరాడుతుంటారు. తాజాగా చంద్రబాబుకి కూడా ఉండవల్లి భయం పరిచయం చేశారనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సీబీఐతో విచారణకు ఆదేశించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉండవల్లి పిటిషన్ లో  పేర్కొన్న  44 మంది ప్రతివాదులకు  నోటీసులు పంపాలని అక్టోబర్ 13న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నోటిసులు పంపడంలో తీవ్ర జాప్యం జరగడంతో హైకోర్టు సీరియస్ అయ్యింది. దీంతో విచారణకు ఆదేశించింది. నోటీసులు పంపడంలో జాప్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం అందరిలో చర్చనీయాంశంగా మారింది.

ప్రతివాదులకు నోటీసులు పంపడంలో జాప్యం వెనుక అదృశ్య శక్తులెవరో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉండవల్లి పిటిషన్ పుణ్యమా అని సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశిస్తే.. ఎవరైతే.. తీవ్రంగా నష్టపోతామని భయపడున్నారో, వారే నోటీసులకు జాప్యానికి కారకులై ఉంటారనే చర్చ జరుగుతోంది.  గతంలో  మార్గదర్శి కేసు విషయంలో  ఏం జరిగిందో ఈ  సందర్భంగా వెలుగులోకి వచ్చింది.  ఈ కేసుకు సంబంధించిన తీర్పులు ఉండవల్లికి తెలియకపోవడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. తాజాగా స్కిల్ స్కామ్ లో ఉండవల్లి పిటిషన్ చంద్రబాబు అండ్ కో ను వణికిస్తుస్తోందని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. అందుకే విచారణ జాప్యం కావాలని ప్రతివాదులు కోరుకుంటున్నాయి.

క్వాష్ పిటిషన్ పై త్వరలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడున్న నేపథ్యంలో ఈ జాప్యానికి ఏదో సంబంధం ఉందనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారంటే.. ప్రతివాదులకు నిద్రలేని రాత్రులేనని చంద్రబాబు, మరికొందరు ప్రముఖల కేసుల్లోని పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.  ఎంతో నిజాయతీగా, నిరాడంబరంగా జీవించే ఉండవల్లివ్యక్తిత్వానికి ఉన్న శక్తి అలాంటిదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఉండవల్లి.. తన పిటిషన్ల ద్వారా  చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి