iDreamPost

Ugadi 2024 Panchangam: వృషభ రాశి వారికి క్రోధీ నామ సంవత్సరం ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి!

Ugadi 2024 Panchangam Vrishabha Rasi Phalalu in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు అనగా ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది. మరి ఈ ఏడాది వృషభ రాశి వారికి ఎలా ఉండనుంది అంటే..

Ugadi 2024 Panchangam Vrishabha Rasi Phalalu in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు అనగా ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అయ్యింది. మరి ఈ ఏడాది వృషభ రాశి వారికి ఎలా ఉండనుంది అంటే..

Ugadi 2024 Panchangam: వృషభ రాశి వారికి క్రోధీ నామ సంవత్సరం ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి!

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో మేష రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందా. ఈ ఏడాది మేష రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

ఈ రాశీ వారికి చంద్రుడు ఉచ్చ బలం సంపాదించుకోవడం వల్ల ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభ రాశిలో జన్మించిన వారికి 2024-05 సంవత్సరం వారికి ఆర్థిక పరిస్థితిలో కొంత వరకు హెచ్చు తగ్గులు రావొచ్చు. స్థిరమైన ఆదాయంలో పెరుగుదల ఉండొచ్చు.. కానీ కొరుకున్నంత కాదు. ఈ రాశి వారు డబ్బు పెట్టుబడి పెట్టేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుంది. ఈ రాశీ వారు తమ బడ్జెట్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు.ఈ ఏడాదిలో వీరు కొన్ని సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. చివరిగా వారే విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.

క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. ప్రతిభ, సామర్థ్యాలను నిరూపించుకుంటే మంచి అవకాశాలు కలిసివస్తాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు వస్తాయి.  ఇక స్వంత వ్యాపారాలు, వ్యవస్థాపక వెంచర్లను ప్రారంభించాలనుకునే వారికి 2024-05 మంచి సమయం. నైపుణ్యం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల్లో ప్రతిభావంతులైన వ్యక్తులతో సంబంధాలు పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి ఉద్యోగులు ఈ ఏడాది తమ కెరీర్ లో ప్రగతి సాధిస్తారని.. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది అంటున్నారు. అలానే వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని.. అంటున్నారు.

ఈ ఏడాది వృషభ రాశి వారి ఆర్థక పరిస్థితి బాగానే ఉందని. భాగస్వామ్యాల పరంగా కొన్ని సవాళ్లు, అడ్డంకులను తీసుకురావొచ్చు.శృంగార సంబంధాలలో కొంత మేర మానసిక క్షోభను అనుభవించవొచ్చు. ఈ స్థానం సంబంధాలలో కొత తవ్రతను తెస్తుంది. ఈ రాశీ వారికి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. తమ ప్రియమైన వారితో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడితే మంచిదని అంటున్నారు. రాహువు వృషభ రాశి మొదటి ఇంట్లో సంచరిస్తాడు.. అందువల్ల 2024-25 వృశభ రాశీ వారు వివాహ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, పండితులను సంప్రదించడం మంచిదని అంటున్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది మేష రాశి వారికి

  • ఆదాయం-2,
  • వ్యయం-8,
  • రాజపూజ్యం-7,
  • అవమానం-3 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి