iDreamPost

తిరుపతి జూ ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు!

Tirupati Zoo: గురువారం రాజస్థాన్ కి చెందిన ఓ యువకుడు తిరుపతి జూ పార్క్ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Tirupati Zoo: గురువారం రాజస్థాన్ కి చెందిన ఓ యువకుడు తిరుపతి జూ పార్క్ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

తిరుపతి జూ ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు!

గురువారం తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ లో  ఘోరం జరిగింది. రాజస్థాన్ కి చెందిన ప్రహ్లాద్ గుర్జార్(38) అనే వ్యక్తి సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ ఉండే సిబ్బంది వారించిన అతడు సింహం ఉండే ఎన్ క్లోజర్ లోకి దూకాడు. దీంతో క్షణాల్లో సింహ అతడిని గమనించి మెడపై దాడి చేసి చంపేసింది. వెంటనే గమనించిన జూ సిబ్బంది సింహాన్ని జూలో బంధించారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాశంగా మారింది. అయితే  ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ లో ప్రహ్లాద్ గుర్జార్ అనే వ్యక్తి సింహం దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు  సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ కి చెందిన  ప్రహ్లాద్ గుర్జార్ తప్పతాగి సింహంతో గేమ్స్ ఆడబోయడని సమాచారం. ప్రహ్లాద్ మద్యం తాగి జూలోకి ప్రవేశించాడు. అతడు హైదరాబాద్ నుంచి బస్సులో తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. జూలోకి వచ్చిన తరువాత  సింహంతో సెల్పీ దిగాలని భావించాడని సమాచారం. ఈ క్రమంలోనే సింహం తల నిమురుతానని జూ సిబ్బందితో వాగ్వాదాని దిగాడు. అయితే తప్పతాగిన అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపారు. అయితే సిబ్బంది కళ్లుగప్పి సింహం ఎన్ క్లోజర్ ల ప్రహ్లాద్ దూకాడు.

అంతటితో ఆగకుండా వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. ఇక జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టేక్కే ప్రయత్నంలో కాలు జారి కింద పడ్డారు. వెంటనే  సింహం ప్రహ్లాద్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించిన వెంటనే అక్కడి చేరుకుని  సింహాన్ని బోనులో బంధించారు. అయితే ఈ లోపే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రహ్లాద్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతడు ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై  పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదా?, లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే  కోణంలోనూ విచారణ చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని, మృతుడి కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. మరి.. తిరుపతి జూలో జరిగిన ఈ విషాధ ఘటనపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి