iDreamPost

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన TTD!

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన TTD!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమల కొండపై ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలను సందర్శిస్తుంటారు. తిరుమల పరిసరాల్లో ఉన్న పాప వినాశనం, కపిలీ తీర్థం వంటి దర్శనీయ స్థలాలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.

తిరుమలలో భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అనేక  చర్యలు తీసుకుంది. తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మ్యూజియంను సిద్దం చేస్తోంది. ఈ భవన నిర్మాణ పనులపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష జరిపారు. అలానే అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమలలో నిర్మిస్తున్న ఎస్వీ మ్యూజియంలోకి అడుగు పెట్టే భక్తులకు సాక్షాత్తు శ్రీవారి ఆలయంలోనే ఉన్నామనే అనుభూతి కలిగేలా నిర్మాణం చేపట్టారు.

భక్తులకు శ్రీవారి ఆలయంలోనే ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి వచ్చేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. మ్యూజియం అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలని సూచించారు. మ్యూజియంలో జోన్ల విధానంలో గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియంలోని ఒక‌టో జోన్‌లో శ్రీవారి ఆల‌య అనుభూతి క‌ల్పించేలా ఉంటుంది. అలానే రెండో జోన్‌లో అన్న‌మ‌య్య గ్యాల‌రీ, ధ్యాన‌మందిరం, స్వామివారి ఆభ‌ర‌ణాలు, నాణేలు, పురాత‌న వ‌స్తువులు హోలోగ్రామ్ సాంకేతికతను ప్ర‌ద‌ర్శించే ఏర్పాటు చేయాల‌ని ఈవో అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ…” ఆభ‌ర‌ణాల 3డి చిత్రాల ద్వారా భ‌క్తులు తాము స్వామివారి నిజ‌మైన ఆభ‌ర‌ణాలు చూస్తున్నామ‌నే అనుభూతి క‌ల్పించాలి. ఇక మూడో జోన్‌లో సాక్షాత్తు శ్రీ‌మ‌హావిష్ణువు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపించేలా రూపొందించాలి. దీని కోసం అంద‌రూ స‌మ‌ష్టి కృషి చేయాలి. ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది భ‌క్తులు సంద‌ర్శించాలా మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఈ నిర్మాణం కోసం అందరూ మ‌న‌సు ల‌గ్నం చేసి భ‌క్తితో ప‌ని చేయాలి” అని ఆయన ఈవో తెలిపారు. మ్యూజియం అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల‌పై టీసీఎస్‌, మ్యాప్ సంస్థ‌ల ప్ర‌తినిధులు ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. మరి.. తాజాగా టీటీడీ తెలిపిన మ్యూజియం నిర్మాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నల్లమల వాగులో కొట్టుకొస్తున్న వజ్రాలు.. తరలి వస్తోన్న జనాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి