iDreamPost

గృహజ్యోతి పథకం ద్వారా.. అద్దెకున్న వారికీ ఫ్రీ కరెంటు

ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిన్నిటి నుంచే విద్యుత్ శాఖ అధికారులు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు ఆ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫ్రీ కరెంటును కిరాయిదారులకు కూడా ఇవ్వనున్నారు.

ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిన్నిటి నుంచే విద్యుత్ శాఖ అధికారులు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు ఆ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫ్రీ కరెంటును కిరాయిదారులకు కూడా ఇవ్వనున్నారు.

గృహజ్యోతి పథకం ద్వారా.. అద్దెకున్న వారికీ ఫ్రీ కరెంటు

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో ముఖ్యంగా ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు హామీలకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

కాగా ఇటీవల తెలంగాణ క్యాబినెట్ గృహజ్యోతి పథకానికి ఆమోదం తెలిపగా.. అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నది. కాగా ఈ ఉచిత విద్యుత్ ను అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వనున్నట్లు దక్షిణ తెలంగాణ డిస్కం వెల్లడించింది. గృహజ్యోతిపథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) మంగళవారం ఎక్స్‌లో తెలిపింది.

గృహ జ్యోతి పథకానికి రూల్స్ ఇవే!

రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్ కే ఈ పథకం వర్తిస్తుందట. రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలను సేకరించరు. అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి.. తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL స్పందించింది.. ఇలాంటి వార్తలు నమ్మవొద్దని.. ‘గృహజ్యోతి’ పథకానికి అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా అర్హులే అని స్పష్టం చేశారు. ఎవరూ అపోహలకు లోను కావొద్దని, నిజమైన అర్హులు కిరాయి ఇళ్లల్లో ఉన్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు ట్వీట్టర్ వేధికగా వెల్లడించారు.

200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకునే గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లు లెక్క లెక్కించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి