iDreamPost

మగాళ్లకూ మంచి రోజులు.. RTCలో పురుషులకు స్పెషల్ బస్సులు!

మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో ఇబ్బందులు పడుతున్న పురుష ప్రయాణికులకు గుడ్ న్యూస్. మగాళ్ల కోసం స్పెషల్ బస్సులు వచ్చేస్తున్నాయి. పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో ఇబ్బందులు పడుతున్న పురుష ప్రయాణికులకు గుడ్ న్యూస్. మగాళ్ల కోసం స్పెషల్ బస్సులు వచ్చేస్తున్నాయి. పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

మగాళ్లకూ మంచి రోజులు..  RTCలో పురుషులకు స్పెషల్ బస్సులు!

తెలంగాణలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ప్రాంభించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 9 నుంచి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని కల్పించారు. దీంతో ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం పున్యమాని బస్సులో కూర్చోవడం దేవుడెరుగు కనీసం నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా పోతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సీట్లు ఉన్నప్పటికీ మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తుండడంతో పురుషుల సీట్లలో కూడా వారే కూర్చుంటున్నారు.

దీంతో పురుషులు బస్సుల్లో నిల్చోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మహాలక్ష్మీ పథకంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మగాళ్లు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పురుషుల నుంచి వస్తున్న డిమాండ్ ల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మగాళ్లకు మంచి రోజులు రానున్నాయని తెలుస్తోంది. పురుషులకు స్పెషల్ బస్సులు అనే దానికి మరింత బలం చూకూర్చేలా పురుషులకు మాత్రమే అనే బోర్డుతో ఉన్న బస్సు దర్శనమివ్వడమే.

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీం పట్నం రూట్లో పురుషులకు మాత్రమే అనే బోర్డుతో ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తోంది. ఇక దీన్ని చూసిన పురుష ప్యాసింజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రయాణ బాధలు అర్ధం చేసుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నందుకు వారు ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయారు. అయితే పురుష ప్రయాణికుల కోసం ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీం పట్నం రూట్లోనే స్పెషల్ బస్సులు నడుపుతున్నారా? లేక అన్ని రూట్లలో కూడా నడిపేందుకు ఆర్టీసీ సిద్దమవుతోందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి