iDreamPost

చేతిలో డబ్బులు లేకపోయినా సరే.. సిటీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు!

  • Published Jun 16, 2023 | 1:50 PMUpdated Jun 16, 2023 | 1:50 PM
  • Published Jun 16, 2023 | 1:50 PMUpdated Jun 16, 2023 | 1:50 PM
చేతిలో డబ్బులు లేకపోయినా సరే.. సిటీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు!

హెడ్డింగ్‌ చూడగానే.. అయితే ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకుంటే.. తప్పులో కాలేసినట్లే. అదేంటి డబ్బులు లేకపోయినా సిటీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు అని అన్నారు.. మరి అది ఎలా సాధ్యం అంటే.. చేతిలో డబ్బులు లేకపోయినా.. ఫోన్‌లో ఉంటే చాలని దాని అర్థం. ప్రస్తుతం ఎక్కడ చూడు డిజిటల్‌ పేమెంట్లే నడుస్తున్నాయి. కరోనా తర్వాత.. ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగాయి. రోడ్డు సైడ్‌ బండి మీద కొనే వాటి దగ్గర నుంచి అంతర్జాతీయ విమానాశ్రాల దాకా.. ఎక్కడ చూసినా డిజిటల్‌ పేమెంట్లే దర్శనం ఇస్తున్నాయి. డిజిటల్‌ చెల్లింపులు ఎంతలా పెరిగినా సరే.. నేటికి కొన్ని చోట్ల ఆ ఊసే లేదు. ఆ జాబితాలో ఆర్టీసీ మరీ ముఖ్యంగా సిటీ బస్సులు ముందు వరుసలో ఉంటాయి.

సిటీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టడానికి మినిమం చార్జీలను 5, 10లకు ఖరారు చేశారు. కానీ చాలా సందర్భాల్లో ఇటు ప్రయాణికుల దగ్గర, అటు కండక్టర్‌ దగ్గర ఐదు రూపాయలు కూడా ఉండటం లేదు. దాంతో వివాదం. ఇక తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారు వంద రూపాయల నోటు ఇస్తే.. చిల్లర కోసం ఎదురు చూడాలి. డిజిటల్‌ చెల్లింపులు పెరగడం వల్ల.. జనాలు తమ దగ్గర ఎక్కువ మొత్తంలో క్యాష్‌ పెట్టుకోవడం లేదు. దీని వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు.. ఆర్టీసీలో కూడా డిజిటల్‌ పేమెంట్లకు అవకాశం కల్పిస్తూ.. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు.. ఎక్కువగా క్యాష్‌లెస్‌ పేమెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు క్యాష్‌లెస్‌ సేవలను అందిస్తున్నాయి. ఇటు ప్రజా రవాణ రంగంలోనూ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ సైతం నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే దూర ప్రాంతాలకు ఉద్దేశించిన సర్వీసుల్లో డిజిటల్‌ చెల్లింపునలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ.. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నడిచే సిటీ బస్సుల్లోనూ క్యాష్‌లెస్‌ సేవలను తీసుకువచ్చే దిశగా నిర్ణయం తీసుకుంది.

నగంరలో నడుస్తున్న సిటీ బస్సుల్లో క్యాష్‌లెస్‌ లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసేందుకుగాను ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సిటీ బస్సుల్లో కూడా డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. నిజానికి గతేడాదే సిటీ బస్సుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది.

ఇక ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో.. డబ్బులతో పాటు ఫోన్‌పే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా.. టికెట్లను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తోంది ఆర్టీసీ. త్వరలోనే ఇదే విధానాన్ని సిటీ బస్సుల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరి ఈ విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి