iDreamPost

యువతి చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడుస్తోన్న తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే

  • Published Feb 17, 2024 | 10:25 AMUpdated Feb 17, 2024 | 7:26 PM

పాతికెళ్లు కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా.. చిన్న పరాజయం ఆమెను మరింత కుంగదీసింది. అందుకే దారుణం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

పాతికెళ్లు కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా.. చిన్న పరాజయం ఆమెను మరింత కుంగదీసింది. అందుకే దారుణం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Feb 17, 2024 | 10:25 AMUpdated Feb 17, 2024 | 7:26 PM
యువతి చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడుస్తోన్న తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే

మారుతున్న కాలంతో పాటు మన జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ప్రస్తుతం మనలో సమాజం కోసం బతుకున్న వారే అధికంగా ఉన్నారు. తమ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా.. నలుగురు ఏమనుకుంటారో అనే భయమే ముందుగా గుర్తుకు వస్తుంది. చెడ్డ పనుల విషయంలో ఇలాంటి భయం ఉండాలి.. ఉండటమే మంచిది కూడా. కానీ వ్యక్తిగత విషయాలు, చదువు, కెరీర్‌ వంటి విషయాల్లో కూడా చాలా మంది నలుగురి గురించే ఆలోచిస్తూ.. తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కాస్త బలహీనులైతే.. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదిరించలేక.. దారుణ నిర్ణయాలు తీసుకుని.. తల్లిదండ్రులకు జీవితాంతం తీరని దుఖాన్ని బహుమతిగా ఇస్తున్నారు. తాజాగా ఓ యువతి చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ వివరాలు..

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కారణం.. తాజాగా వెల్లడించిన తెలంగాణ గ్రూప్ ఫోర్‌ పరీక్షలో సదరు యువతికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. హాస్టల్‌ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువతిని మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష(24)గా గుర్తించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ కు చెందిన శిరీష.. గత కొంత కాలంగా.. జవహర్ నగర్‌ లోని ఎస్సార్ బాలికల హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా గ్రూప్ ఫోర్‌ పరీక్షకు ప్రిపేర్ అయ్యి.. ఎగ్జామ్‌ రాసింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఫలితాలు విడుదల చేశారు. ఈ క్రమంలో శిరీషకు గ్రూప్‌ 4 ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన వసతి గృహ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శిరీష.. గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చినందుకే ఆత్మహత్య చేసుకుందా లేక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొలువు లేకుంటే బతుకు లేదనుకున్నావా బిడ్డా.. ఎందుకు ఇంత ఘోర నిర్ణయం తీసుకున్నావు.. అమ్మానాన్న గుర్తుకు రాలేదా అని శిరీష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరి యువతి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి