iDreamPost

ఆ ఉద్యోగులకు KCR సర్కార్ శుభవార్త.. ఈ నెల నుంచి వారి జీతాలు పెంపు!

  • Published Jul 16, 2023 | 12:32 PMUpdated Jul 16, 2023 | 4:57 PM
  • Published Jul 16, 2023 | 12:32 PMUpdated Jul 16, 2023 | 4:57 PM
ఆ ఉద్యోగులకు KCR సర్కార్ శుభవార్త.. ఈ నెల నుంచి వారి జీతాలు పెంపు!

తెలంగాణలో ఎన్నికల హీట్‌ మొదలయ్యింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌-నవంబర్‌ల మధ్య ఎలక్షన్స్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. మూడోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రెండో విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులు చేసుకునే బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ, రైతు బంధు సాయం ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. జీతాలు పెంచడమే కాక.. పెరిగిన జీతాలను ఈ నెల నుంచే వారి ఖాతాల్లో జ మ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మధ్యాహ్నా భోజన పథకం కార్మికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు రెడీ అవుతోంది. వారి వేతనాలను పెంచడమే కాక.. ఈ నెల నుంచే వాటిని ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సర్కార్‌ నిర్ణయం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న సుమారు 54,201 మంది కుక్‌–కమ్‌ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల సమావేశం సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రతినెల రూ. 1000 గౌరవ వేతనంగా ఇస్తున్నారు. ఆ మెుత్తాన్ని రూ.3 వేలకు పెంచుతామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పెంచిన వేతనాలను జులై నుంచి అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పెంచిన గౌరవ వేతనం ద్వారా ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందని సబితా ఇంద్రా. చాలా ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచలేదని.. ఈ నెల నుంచి వారికి రూ. 3 వేలు వేతనం అందిచనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సబితా సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి