iDreamPost

హైదరాబాద్లో టన్నెల్ రోడ్లు.. రూట్లు ఇవే!

Tunnel Roads in Hyderabad: హైదరాబాద్ అభివృద్ది చెందుతున్న కొద్ది ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

Tunnel Roads in Hyderabad: హైదరాబాద్ అభివృద్ది చెందుతున్న కొద్ది ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

హైదరాబాద్లో టన్నెల్ రోడ్లు.. రూట్లు ఇవే!

హైదరాబాద్ లో రోజు రోజుకీ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే.. రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎవరిని అడిగినా ట్రాఫిక్ ఇబ్బందుల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. వర్షా కాలం అయితే ట్రాఫిక్ నరకం మరింత ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తుంటాయి. నగరంలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ సమస్యలపై పలుమార్లు సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఇటీవల ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయాయి. వాహనదారులు రోడ్డుపైకి వచ్చిన తర్వాత పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహంచారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కారం తెలుసుకునేందుకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పలు రద్దీ ప్రదేశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు టన్నెల్ రహదారుల నిర్మాణంపై దృష్టి సారించి దీనికి సంబందించిన ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్తగా 5 టన్నెళ్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపుగా 39 కిలోమీటర్ల మేర సొరంగ టెన్నెల్ రోడ్లను నిర్మించేందుకు నివేదిక రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఆసక్తి ఉన్న వారిని టెండర్లకు ఆహ్వానించించారు. గత పదేళ్ల నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించారు. అయినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

అధికారులు ప్రతిపాదించిన5 మార్గాలు ఇవే..

  • ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా ఖాజా గూడ, నానక్ రామ్ గూడ – 9 కిలోమీటర్ల
  • ఐటీసీ కోహినూర్ నుంచి బంజారా హిల్స్ రోడ్డ నెం.10 వయా జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 45 – 7 కిటోమీటర్లు
  • ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్‌టీయూ వరకు వయా మైండ్ స్పేస్ జంక్షన్ – 8 కిలోమీటర్లు
  • నాంపల్లి నుంచి చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ గుట్ట వయా చార్మినార్, ఫలక్ నూమా- 9 కిలోమీటర్ల
  • జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్ – 6 కిలోమీటర్ల

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి