iDreamPost

బ్రేకింగ్: KCR కి ప్రమాదం.. అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిక

  • Published Dec 08, 2023 | 8:35 AMUpdated Dec 08, 2023 | 9:12 AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. అర్థరాత్రి సమయంలో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఇంతకు ఏం జరిగిందంటే..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. అర్థరాత్రి సమయంలో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published Dec 08, 2023 | 8:35 AMUpdated Dec 08, 2023 | 9:12 AM
బ్రేకింగ్: KCR కి ప్రమాదం.. అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిక

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‭కు ప్రమాదానికి గురయ్యారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారని సమాచారం. గురువారం అర్థరాత్రి 2 గంటల సమయంలో నిద్ర లేచిన ఆయన బాత్రూంలో కింద పడినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో జాయిన అయిన వెంటనే కేసీఆర్ కు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో మిగతా వైద్య పరీక్షలు నిర్వహించి.. సర్జరీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. కాలికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయిందని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోవడంతో.. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు. గత మూడు రోజులుగా ఆయన తన ఫామ్ హౌజ్ లో ప్రజలను కలుస్తున్నారు. జనాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్ కి తరలి వస్తున్నారు. వారితో మాట్లాడుతూ.. ఓటమి గురించి ఓదారుస్తూ.. భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చిస్తూ బిజీగా గడుపుతున్నారు కేసీఆర్. ఇక ఈ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వెల్ నుంచి పోటీ చేశారు.

అయితే అనూహ్యంగా ఆయన కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి  మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇద్దరిని ఓడించి.. జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఇక కేసీఆర్ గజ్వెల్ లో మాత్రమే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం అయ్యింది. ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రతిపక్షంలో నిలిచి.. ప్రజా సమస్యలపై పోరాడతామని.. ఇకపై ప్రజల్లోనే ఉంటామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి