iDreamPost

TS Election Results 2023: పాతాళాన ఉన్న కాంగ్రెస్​ను పైకి లేపింది ఆయనే.. ఎవరీ సునీల్ కనుగోలు!

  • Author singhj Updated - 04:11 PM, Sun - 3 December 23

తెలంగాణలో పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనూహ్య విజయం సాధించడం వెనుక పైకి కనిపించని ఓ అదృశ్య శక్తి పాత్ర ఎంతో ఉంది.

తెలంగాణలో పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనూహ్య విజయం సాధించడం వెనుక పైకి కనిపించని ఓ అదృశ్య శక్తి పాత్ర ఎంతో ఉంది.

  • Author singhj Updated - 04:11 PM, Sun - 3 December 23
TS Election Results 2023: పాతాళాన ఉన్న కాంగ్రెస్​ను పైకి లేపింది ఆయనే.. ఎవరీ సునీల్ కనుగోలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంలా కనిపిస్తోంది. దీంతో హస్తం పార్టీ క్యాడర్ సంబురాలు చేసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమవ్వడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్​ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ చీఫ్​ను కలసిన వారిలో రాచకొండ సీపీ మహేష్​ భగవత్, సంజయ్ కుమార్ జైన్​ కూడా ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో ఆయన్ను అభినందించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని కూడా పెంచారు. కౌంటింగ్​లో కాంగ్రెస్ హవా నడుస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు రేవంత్ ఇంటికి భారీగా చేరుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడుతుండటంతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. అయితే ఈ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నాయకుల కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా డైనమిక్ లీడర్​గా పేరున్న రేవంత్.. ముందు నుంచీ ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్​కు అంతా తానై ముందుండి నడిపించారు. క్యాంపెయినింగ్​లో భాగంగా నోటిఫికేషన్ ముగిసే వరకు ఆయన 63 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఏకంగా 87 ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈసారి మార్పు అవసరమని.. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పర్యటించారు రేవంత్ రెడ్డి. వీలైనన్ని సభలు, సమావేశాలు, రోడ్​షోలు, కార్నర్ మీటింగులు జరుపపుతూ క్యాంపెయిన్​ను చక్కటి ప్లానింగ్​తో అమలు చేశారు. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన విమర్శలు, తమ పార్టీ పవర్​లోకి ఏం చేస్తుందో వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. బీఆర్ఎస్​-బీజేపీ ఒకటేనని.. ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒకటేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపినట్లే కనిపిస్తోంది. ఇటు రేవంత్ తన స్టైల్​లో దూకుడుగా ప్రచారం చేయగా.. అటు భట్టి విక్రమార్క కూల్​గా క్యాంపెయినింగ్ చేసుకుంటూ పోయారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య-డీకే శివకుమార్ స్టైల్​లో తెలంగాణలో భట్టి విక్రమార్క-రేవంత్ రెడ్డి జోడీ కాంగ్రెస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే వీళ్లతో పాటు మరో వ్యక్తి హస్తం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనే సునీల్ కనుగోలు. ఈ ఎలక్షన్స్​లో కాంగ్రెస్​కు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఆయన.. అన్నీ తానై వ్యవహరించారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించిన సునీల్.. తెలంగాణలోనూ పాతాళంలో ఉన్న హస్తం పార్టీ జెండాను పైకి లేపి రెపరెపలాడేలా చేశారు.

క్యాంపెయిన్​లో ప్రజలకు కనిపించిన ఫేస్ రేవంత్ అయితే వెనుక ఉండి చక్రం తిప్పింది సునీల్ కనుగోలు. వార్ వన్ సైడ్ అంటూ రేవంత్​తో ప్రచారాల్లో చెప్పిస్తూ అధికార పక్షాన్ని డిఫెన్స్​లో పడేశారాయన. భారత్ జోడో యాత్రకు అనుబంధంగా చేసుకుంటూ వచ్చిన యాత్ర నుంచి రేవంత్​ను కూల్ అండ్ కంపోజర్ కలిగిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. క్యాంపెయినింగ్​లో దూకుడుగా వ్యవహరించినా పవర్​లోకి వస్తే రేవంత్ దూకుడను పక్కనబెడతారని మీడియాకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూల్లో హింట్ ఇచ్చారు. ఇదంతా వర్కవుట్ అయింది. సునీల్ కనుగోలు వేసిన ప్రతి ప్లాన్ వర్కవుట్ కావడంతో కాంగ్రెస్ గెలుపులో ఆయనే కనిపించని అదృశ్య శక్తి అంటూ నేతలు పొగుడుతున్నారు. మరి.. సునీల్ కనుగోలు స్ట్రాటజీ సక్సెస్ కావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బండ్ల గణేశ్ కి జేజేలు పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి