iDreamPost

దుబ్బాక ఉప ఎన్నికలో ట్విస్ట్‌

దుబ్బాక ఉప ఎన్నికలో ట్విస్ట్‌

దుబ్బాక ఎన్నికల్లో ట్విస్ట్‌ నెలకొంది. బీజేపీ గెలుపు ఖాయమైనా.. అధికారిక ప్రకటనకు చిన్నపాటి అడ్డంకి ఏర్పడింది. కౌంటింగ్‌లో నాలుగు ఈవీఎంలు మోరాయించాయి. చివరిదైన 23వ రౌండ్‌లో ఈ నాలుగు ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చివరి రౌండ్‌ ఫలితం ప్రకటనలో ఆలస్యమైంది. అప్పటికే బీజేపీ విజయం ఖాయం అయింది.

నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లు ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) శశాంక్‌ గోయిల్‌ తెలిపారు. 21, 188 పోలింగ్‌ కేంద్రాల ఫలితాలు రాలేదని చెప్పారు. ఇందుకు సంబంధించి వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కిస్తామని సీఈవో తెలిపారు. 136, 157/ఏ పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ తర్వాత క్లియర్‌ చేయకుండానే పోలింగ్‌ చేపట్టారని చెప్పారు. ఇక్కడ నిబంధనల ప్రకారం ఓట్లు లెక్కింపు చేపడతామని శశాంక్‌ గోయిల్‌ ప్రకటించారు.

ఈ నాలుగు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో సంబంధం లేకున్నా బీజేపీ విజయం ఖరారైంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావుకు 1470 ఓట్లు వచ్చాయి. ఇక లెక్కించాల్సిన ఓట్లు 1,669 ఉన్నాయి. ఇందులో 90 శాతానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్‌కు రావాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమనే చెప్పాలి. ఈ లెక్కలు అన్నీ వేసుకున్న తర్వాతనే బీజేపీ శ్రేణులు తుది ఫలితాల ప్రకటనతో సంబంధం లేకుండా సంబరాలు మొదలెట్టాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి