iDreamPost

తెలంగాణ కాంగ్రెస్‌స్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

  • Published Oct 21, 2023 | 3:03 PMUpdated Oct 21, 2023 | 3:03 PM

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. మరి రాహుల్‌ పర్యటన వల్ల కాం‍గ్రెస్‌కు లాభమా.. నష్టమా అంటే..

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. మరి రాహుల్‌ పర్యటన వల్ల కాం‍గ్రెస్‌కు లాభమా.. నష్టమా అంటే..

  • Published Oct 21, 2023 | 3:03 PMUpdated Oct 21, 2023 | 3:03 PM
తెలంగాణ కాంగ్రెస్‌స్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని.. ఎలక్షన్‌ పోరులో విజయం సాధించాలని చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది అని అంచాన వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ నేతలు.. కేసీఆర్‌ కుటుంబం మీద, బీఆర్‌ఎస్‌ పాలన మీద విమర్శలు చేస్తుండగా.. అధికారపార్టీ నేతలు అందుకు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ మూడు రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.

అయితే ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ సహా.. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతోన్న వ్యాఖ్యలు చూస్తే.. పార్టీపై వ్యతిరేక ప్రభావం పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో అసలు రాహుల్‌ పర్యటన వల్ల తెలంగాణ కాంగ్రెస్‌కు లాభామా.. నష్టమా అనే దాని మీద జోరుగా చర్చ సాగుతోంది. మరి దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే..

నేతలను ఏకం చేసిన యాత్ర..

రాహుల్‌ బస్సు యాత్ర ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని.. కాకపోతే పార్టీకి చాలా బూస్ట్‌ ఇచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనగానే క్రమశిక్షణారహిత్యం అనే మాటే ముందుగా వినిపిస్తుంది. అయితే ఈ బస్సుయాత్ర మాత్రం నేతల మధ్య సక్యతను పెంచింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాహుల్‌ గాంధీ బస్‌ యాత్ర వల్ల ప్రజల్లో కాంగ్రెస్‌ మీద నమ్మకం సంగతి ఏమో కానీ.. పార్టీ నేతలను ఒక్క తాటి మీదకు చేర్చిందని.. నాయకులంతా ఒకే వేదిక మీద కనిపించడంతో.. కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రం.. పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశమే ఎక్కువగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అసత్య ప్రచారంతో విమర్శలు..

రాహుల్‌ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సందర్భంగా భారీ అవినీతి జరిగింది అంటూ.. నోటికి తోచిన లెక్కలు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అయిన ఖర్చు 80 వేల కోట్ల రూపాయలయితే.. రాహుల్‌ గాంధీ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని వ్యాఖ్యానించడం చూస్తే.. కావాలనే కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇక రాహుల్‌ గాంధీని విమర్శిస్తూ.. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని.. లేకపోతే.. కేసీఆర్‌ కుటుంబం నాంపల్లి దగ్గర అడుక్కునేవాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అసలు రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ఎలా సాధించుకున్నాము అనే దాని మీద ఏమైనా అవగాహన ఉందా.. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది.. ఎందరి ప్రాణాలు బలి తీసుకుంది అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవచ్చు.. కానీ బాధలు అనుభవించిన జనాలు మాత్రం మరవరు. ఉద్యమం అంటే ఇంత చిన్న చూపు చూసే కాంగ్రెస్‌ నాయకులకు పట్టం కడితే.. ఇక మనవి బానిస బతుకులే అవుతాయని అనుకుంటున్నారట జనాలు.

పాపం రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దామని భావించారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకున్నారు. కానీ ఏం లాభం.. నోటి దురుసు కారణంగా.. చేజేతులా వ్యతిరేకత మూట గట్టుకుంటున్నారు. సో రాహుల్‌ బస్‌యాత్ర కాంగ్రెస్‌కు బూస్ట్‌ అయ్యేదే.. కానీ నేతల తీరు వల్ల అది రివర్స్‌ అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి