iDreamPost

మేనిఫెస్టో లేకుండానే ప్రజల్లోకి.. ప్రచార ఆర్భాటాలు లేని MIM

  • Published Oct 20, 2023 | 9:53 AMUpdated Oct 20, 2023 | 9:53 AM

ఎన్నికలు అనగానే.. ప్రధానంగా వినిపించే అంశం మేనిఫెస్టో​. తమను గెలిపిస్తే.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో వివరిస్తూ.. పార్టీలన్ని మేనిఫెస్టోని విడుదల చేస్తాయి. పార్టీల గెలుపోటముల్లో మేనిఫెస్టో ప్రధాన ప్రాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓ పార్టీ మాత్రం ఏళ్ల తరబడి మేనిఫెస్టో​ లేకుండా ప్రజల్లోకి వెళ్తుంది. ఇంతకు ఆ పార్టీ ఏంది అంటే..

ఎన్నికలు అనగానే.. ప్రధానంగా వినిపించే అంశం మేనిఫెస్టో​. తమను గెలిపిస్తే.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో వివరిస్తూ.. పార్టీలన్ని మేనిఫెస్టోని విడుదల చేస్తాయి. పార్టీల గెలుపోటముల్లో మేనిఫెస్టో ప్రధాన ప్రాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓ పార్టీ మాత్రం ఏళ్ల తరబడి మేనిఫెస్టో​ లేకుండా ప్రజల్లోకి వెళ్తుంది. ఇంతకు ఆ పార్టీ ఏంది అంటే..

  • Published Oct 20, 2023 | 9:53 AMUpdated Oct 20, 2023 | 9:53 AM
మేనిఫెస్టో లేకుండానే ప్రజల్లోకి.. ప్రచార ఆర్భాటాలు లేని MIM

తెలంగాణలో ఎన్నికలకు నగరా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 30 న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు విడుదల అవుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన నాటి నుంచి పార్టీలన్ని ఫుల్‌ బిజీగా ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన మొదలు.. మేనిఫెస్టో విడుదల, ప్రచార కార్యక్రమాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఎన్నికలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మేనిఫేస్టో. తమను గెలిపిస్తే.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో వివరించేదే మేనిఫెస్టో. ఇప్పటికే బీఆర్‌ పార్టీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. అనేక రకాల సంక్షేమ పథకాలను చేర్చుతూ తన మేనిఫెస్టోని విడుదల చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో తమ మేనిఫెస్టో విడుదల చేసింది. చిన్న పార్టీలు ఆఖరికి స్వతంత్రులు సైతం తప్పకుండా మేనిఫెస్టో విడుదల చేస్తాయి. కానీ వజిస్ల్‌ పార్టీ మాత్రం ఎలాంటి మేనిఫెస్టో లేకుండానే ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది.

హైదరాబాద్‌ కేంద్రంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, వరసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆల్‌ ఇండియా మజ్లిస్‌– ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) మాత్రం ఇప్పటి వరకు ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా.. ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది ఎంఐఎం పార్టీ.

ఆరున్నర దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయలేదు ఎంఐఎం. తెలంగాణలో మాత్రమే కాక.. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సైతం మేనిఫెస్టో లేకుండానే బరిలో దిగుతోంది ఎంఐఎం. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏఐఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా ప్రత్యేక రికార్డు సృష్టించింది.

భాగ్యనగరం టూ భారతదేశం..

హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ.. నేడు జాతీయ స్థాయికి విస్తరించింది. ప్రస్తుతం తెలంగాణలోనే కాక.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటుంది ఎంఐఎం పార్టీ. ‘‘మా పనితీరు.. మా గుర్తింపు’’ అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగుతుంది ఎంఐఎం. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కాక పార్లమెంటులోనూ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుంది. హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ, ఔరంగాబాద్‌ నుంచి ఇంతీయాజ్‌ జలీల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే..

మభ్యపెట్టడానికే మేనిఫెస్టో..

ప్రజలను మభ్య పెట్టడానికే మేనిఫెస్టో విడుదల చేస్తారని.. తమకు అంత అవసరం లేదని అంటున్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలను మభ్య పెట్టడానికి మేనిఫెస్టో ఒక ప్రచారసాధనం. ఓట్లు రాబట్టుకునేందుకు ఇది ఒక ఆయుధం. కానీ మాకు ఆ అవసరం లేదు. అందుకే మేం ఇంతవరకు ఎన్నడూ ఆ ఊసెత్త లేదు. ఎన్నికల వేళ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వం. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఎప్పుడూ జనాలకు అందుబాటులో ఉంటాం. ఇలాంటప్పుడు ఇక మాకు మేనిఫెస్టో అవసరం ఏముంది. అమలు కాని హామీలిచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మజ్లిస్‌ పార్టీ పద్ధతి కాదు అని స్పంష్టం చేశారు అసదుద్దీన్‌. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి