iDreamPost

టీఆర్ఎస్.. ఇక బీఆర్ ఎస్… భార‌త్ రాష్ట్ర స‌మితి

టీఆర్ఎస్.. ఇక  బీఆర్ ఎస్… భార‌త్ రాష్ట్ర స‌మితి

తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మ‌రో కీల‌క మ‌లుపు. తెరాస‌ను జాతీయ పార్టీగా మారుస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ద‌స‌రా వేళ‌ కొత్త జాతీయ పార్టీకి నామ‌క‌ర‌ణం చేశారు. తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌గా, స‌భ్యులు ఊహించిన‌ట్లుగా ఏక‌గ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానం ప్ర‌కారం తెరాస ఇకపై భార‌త రాష్ట్ర‌స‌మితిగా మార‌నుంది. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు.

అనంత‌రం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ ను భార‌త్ రాష్ట్ర స‌మితిగా మార్చిన‌ట్లు అందులో పేర్కొన్నారు. దీంతో 21 ఏళ్ల‌ టీఆర్ఎస్ ప్ర‌స్థానం మ‌రో మెట్టుఎక్కిన‌ట్ల‌య్యింది. సుమారు 8 రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కూడా ఇవాళ టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

తెరాస‌ను జాతీయ‌పార్టీగా , భార‌త్ రాష్ట్ర‌స‌మితిగా మార్చ‌గానే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ సంబురం మొద‌లైంది. జిల్లా పార్టీకార్యాల‌యాల్లో స్థానిక నేత‌లు బాణాసంచా కాల్చారు. నినాదాలు చేశారు. తెలంగాణ మోడ‌ల్ లో దేశంలో మంచి మార్పుకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టుబోతోంద‌ని నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి