iDreamPost

ఓం రౌత్ పై కల్కి ఎఫెక్ట్! సినిమా పోయినా ట్రోల్స్ తప్పట్లేదు!

  • Author ajaykrishna Published - 09:00 PM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 09:00 PM, Mon - 31 July 23
ఓం రౌత్ పై కల్కి ఎఫెక్ట్! సినిమా పోయినా ట్రోల్స్ తప్పట్లేదు!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల బడ్జెట్స్ ఎలా పెరిగిపోతున్నాయో తెలిసిందే. బడ్జెట్ కి తగ్గట్టుగా క్రేజ్.. సినిమాకి హైప్ క్రియేట్ అవుతున్నప్పటికీ.. రావాల్సిన కలెక్షన్స్, ప్రశంసలు కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇండియాలో ప్రతీ సినిమా హై బడ్జెట్ తో చేస్తున్న ఏకైక హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ లతో పాటు ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ కూడా బిగ్ బడ్జెట్ తో రూపొందింది. కానీ.. ఎగ్జాక్ట్ గా ఎంత పెట్టుబడి పెట్టారు అనే వివరాలు మాత్రం ఇప్పటిదాకా మేకర్స్ బయటికి చెప్పకపోవడం గమనార్హం. డైరెక్టర్ ఓం రౌత్ పురాతన ఇతిహసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ ని రూపొందించారు.

ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతిసనన్ సీతగా.. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. మొత్తానికి బిగ్ హైప్ తో.. జై శ్రీరామ్ అనే నినాదంతో థియేటర్స్ లో విడుదలైన ఆదిపురుష్.. విజువల్స్ పరంగా చాలా నిరాశపరిచిందని టాక్ వచ్చింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాయి. సుమారు రూ. 700 కోట్లు బడ్జెట్ పెట్టిన మూవీలో.. విజువల్స్ దారుణంగా ఉండేసరికి డైరెక్టర్ ఓం రౌత్ ని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఆడుకున్నారో తెలిసిందే. మొత్తానికి భారీ ట్రోల్స్ మధ్య ఆదిపురుష్ దాదాపు రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అదంతా కేవలం ప్రభాస్ క్రేజ్ వల్లే అన్ని కలెక్షన్స్ సాధ్యం అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ సినిమా టైమ్ లోనే కాదు.. సినిమా వెళ్ళిపోయాక అంటే ఇప్పుడు కూడా డైరెక్టర్ ఓం రౌత్ ని ట్రోల్స్ లో ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నాగ్.. ‘కల్కి 2898 AD’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇటీవల రిలీజైన కల్కి గ్లింప్స్ దాదాపు హాలీవుడ్ లెవెల్ ని తలపిస్తున్నాయి. దీంతో కల్కి విజువల్స్ తో ఆదిపురుష్ విజువల్స్ ని పోల్చుతూ ఓం రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. రామాయణం లాంటి ఇతిహాసాన్ని.. క్వాలిటీ లేని విజువల్స్ తో అపహాస్యం చేశావంటూ ఓం పై కామెంట్స్ చేస్తున్నారు. పైగా నాగ్ అశ్విన్ ని చూసి క్వాలిటీ ఎలా ఉండాలో నేర్చుకోమని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కల్కి ఎఫెక్ట్ ఓం పై పడిందని క్లియర్ గా అర్ధమవుతుంది. సో.. వచ్చే ఏడాది కల్కి రిలీజ్ కాబోతుంది. మరి ఆదిపురుష్ తో కల్కి విజువల్స్ పోల్చితే మీకు ఏం అనిపిస్తుందో కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి