iDreamPost

రైలు – ప్రజా జీవితం

రైలు – ప్రజా జీవితం

రైల్వే లైను కొత్తగా వేయాలంటే సరుకు రవాణా ప్రామాణికంగా తీసుకుంటారు. అంతే కానీ ప్రయాణికులు ఈ మార్గంలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉందని లెక్కలు వేయరు.అందుకనే మనం అనుకున్న రైల్వే లైన్లు వేయరు..ఇక పోతే మన రాష్ట్రానికి చెందిన వారు మంత్రి హోదా లో ఉంటే సరుకు రవాణా లెక్కలు చూపి కొత్త లైన్ల ప్రతిపాదన తీస్తారు.వాళ్ళు అధికారంలో ఉండ గలిగితే కొత్త ట్రాక్ సర్వేదశ నుండి బడ్టెట్ కేటాయింపు దశ కు వస్తుంది.అసలు ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పెట్టి కొత్త లైన్లు తెస్తున్నాయి.రాష్ట్ర వాటా కింద భూ సేకరణ చేస్తే కేంద్ర వాటా కింద ట్రాక్ వేస్తున్నారు.

రెండు సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్ కేంద్ర సాధారణ బడ్జెట్ తో కలుపుతున్నారు.ఇదీ మంచి నిర్ణయమే. ఖర్చులన్నీ బడ్జెట్ నుంచి విడుదల చేస్తున్నప్పుడూ ఏదో హడావుడి గా సభలో ఆ ఊరికి రైలు ఈ ఊరి నుంచి రైలు అని జనాకర్షకంగా ప్రకటించడం దేనికి? ఎన్నో ప్రతిపాదనలు పెట్టి అనీ చేయకపోవడం కన్నా ఉన్నవి చేయగలిగితే గొప్ప విషయమే. రైళ్ళ ప్రకటన కూడా గుట్టు చప్పుడు కాకుండా చేయడం కూడా మంచిదే.

Read Also: నడికుడి-శ్రీకాళహస్తి రైలుకి కేంద్రం తీపి కబురు

ఇక , బుల్లెట్ రైలు వేసేకన్నా దేశ వ్యాప్తంగా రద్దీ రైలు మార్గాలలో మూడవ లైను ఏర్పాటు చేస్తే సరుకు రవాణాకు సులువైన మార్గాలు ఏర్పడి రోడ్డు రవాణా తగ్గి డీజిల్ వాడకం బాగా తగ్గి విదేశీ మారక నిల్వలు పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

కొత్తగా మనం వింటున్న మాట ప్రయివేటు రైళ్ళు. ఇది వినడానిక బాగనే ఉన్నా…ప్రజల జేబుకు చిల్లు.

అసలు రిజర్వేషన్ చేయించుకున్న వారు రైలు బయలు దేరడావికినరెండు రోజుల ముందు కేన్సిల్ చేయించిన ఏదో పదో ఇరవై కాక , ఫీ పేరుతో దోపిడి మొదలైంది।ఇక వెయిట్ లిస్ట్ ఉన్నా, తత్కాల్ కోటా పెంచి దోపిడి చేస్తోన్నారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్ళు…

చర్లపల్లి-వారణాసి,
లింగంపల్లి-తిరుపతి,
చర్లపల్లి-పర్వేలి,
విజయవాడ-విశాఖ,
చర్లపల్లి-శాలిమార్‌,
ఔరంగాబాద్‌-పన్వెలి,
సికింద్రాబాద్‌-గువాహటి,
చర్లపల్లి-చెన్నై,
గుంటూరు-లింగంపల్లి

Read Also: నడికుడి To శ్రీకాళహస్తి వెళ్లే రైలు మరి కొద్ది సమయంలో…

అబ్బో అని చంకలు గుద్దుకునేవారికి ఒక్కసారి స్పెషల్ ఫెయిర్ రైలు ఎక్కి చూస్తే తెలుస్తుంది.అత్యంత దుర్మార్గమైన దోపిడి.సాధారణ రైలు లాగ ఆ రైలు రిజర్వేషన్ భోగి ఎక్కితే రైలు మొదలు నుంచి రిజర్వేషన్ రుసుం వసూలు చేస్తారు.రైలు ఛార్జీ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. మనమూ అనొచ్చు ఏం పెట్టలేమా అని .ఇప్పటికే ప్రీమియం తత్కాల్ దోపిడి జరుగుతోంది.త్వరలో వి.ఆర్.ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించే శాఖ రైల్వే శాఖ అని అనిపిస్తోంది.
అప్పుడు మనమూ బోరున విలపించొచ్చు.

ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమానికి గానీ ప్రజలను దోచుకోవడానికి కాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి