iDreamPost

భూమ్మీదే కాదు అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్.. ఇస్రో రాకెట్ ప్రయోగం ఆలస్యం!

  • Author singhj Published - 12:10 PM, Tue - 8 August 23
  • Author singhj Published - 12:10 PM, Tue - 8 August 23
భూమ్మీదే కాదు అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్.. ఇస్రో రాకెట్ ప్రయోగం ఆలస్యం!

ట్రాఫిక్ జామ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. ఎవరైనా సెలబ్రిటీనో, రాజకీయ నేతో వెళ్తే రోడ్లపై వాహనాలను ఆపేయడం చూస్తూనే ఉంటాం. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లపై యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాహనాలన్నీ జామ్ అవుతాయి. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆలయాల సమీపంలో ట్రాఫిక్​తో వందల కొద్దీ వాహనాలు బారులు తీరతాయి. రాజకీయ సభలు నిర్వహించినప్పుడు కూడా వెహికిల్స్​ను ఆపేస్తారు. ఇక, వర్షాకాలంలో ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు నరకం చూస్తారు. అయితే ఈ ట్రాఫిక్ సమస్య కేవలం భూమ్మీదే కాదు అంతరిక్షంలోనూ ఉందంటే నమ్ముతారా? అవును, ఇది నిజమే.

విశ్వం గురించి, ఇతర గ్రహాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ప్రపంచ దేశాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగా అంతరిక్షంలోకి రాకెట్లను పంపి ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇలా పంపిన ఉపగ్రహాల వ్యర్థాలు స్పేస్​లోనే పేరుకుపోతున్నాయి. దీని వల్ల అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ స్పేస్ ట్రాఫిక్ జామ్ కారణంగా ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగం ఒకటి ఆలస్యమైంది. అయితే స్పేస్​లో పేరుకుపోయిన వ్యర్థాలకు సంబంధించి రీసెంట్​గా ఇస్రో ఒక అధ్యయనం చేసింది.

ఇస్రో అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారుగా 27 వేల వస్తువులు అంతరిక్షంలో పేరుకుపోయినట్లు ఇస్రో గుర్తించింది. ఆ వస్తువుల్లో 80 శాతం వరకు భూమి నుంచి వివిధ దేశాలు పంపించిన ఉపగ్రహాల శిథిలాలే ఉన్నాయని ఇస్రో తెలిపింది. స్పేస్​లో 10 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉన్న వస్తువులైతే లక్షల సంఖ్యలో పేరుకుపోయాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్​ వెల్లడించారు. ఈ వస్తువులతో పాటు యాంటీ శాటిలైట్ పరీక్షల కారణంగా పేరుకుపోయిన అంతరిక్ష వ్యర్థాలు కూడా అధికంగానే ఉన్నట్లు ఇస్రో తాజాగా అంచనా వేసింది.

స్పేస్​లో ఉన్న వ్యర్థాల్లో ఎక్కువ మటుకు చైనా, అమెరికా, భారత్​, రష్యా దేశాలు చేపట్టిన ప్రయోగాల వల్లే ఏర్పడినట్లు సమాచారం. ఈ వ్యర్థాలన్నీ చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో జులై 30న ప్రయోగించిన పీఎస్​ఎల్వీ-సీ56 పరీక్షను ఒక నిమిషం ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఇందులోని నాలుగో దశ ద్వారా ఇస్రో మొత్తంగా ఏడు విదేశీ ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. అయితే దీని కక్ష్యను మారుస్తూ 300 కిలోమీటర్ల స్థాయికి తగ్గించింది. తక్కువ ఎత్తుకు రావడం వల్ల ఇది త్వరగా భూకక్ష్యలోకి ప్రవేశించి పడిపోతుంది. దీంతో స్పేస్​లో ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వ్యర్థాలు తగ్గుతాయని ఇస్రో భావిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి